
ఒక వ్యక్తి కొంత మంది పిల్లలను ఫైవ్‌స్టార్ హోటల్‌కు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పదార్థాలు తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆ పిల్లలకు ఈయన తండ్రి కాదు. కనీసం దూరపుచుట్టం కాదు. వీరు వీధిబాలలు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో 39 మిలియన్‌ల వ్యూస్‌ను దక్కించుకుంది.
కవల్‌చాబ్ర అనే వ్యక్తి కారు ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయినప్పుడు కొందరు పిల్లలు కారు అద్దాలను తుడవడం మొదలు పెట్టారు. వారిని చూడగానే చాబ్రకు ‘అయ్యో!’ అనిపించింది. వెంటనే పిల్లలను కారులో కూర్చోబెట్టుకొని ఫైస్టార్ హోటల్‌కు తీసుకువెళ్లాడు. ఈ వైరల్ వీడియో ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment