వైరల్‌ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు | Madhya Pradesh Man Eating Glass For Over 40 Years | Sakshi
Sakshi News home page

వైరల్‌ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు

Published Sun, Sep 15 2019 3:53 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

కొందరికి తరచూ టీ తాగడం, మరికొందరికి సిగరేట్‌ తాగడం.. ఇంకొందరికి మద్యం సేవించడం... ఇలాంటి అలవాటు ఉంటాయి. కానీ గాజు ముక్కలు తినడం ఎవరికైనా అలవాటు ఉంటుందా? నాకు ఉందని చెబుతున్నాడు మధ్య ప్రదేశ్‌కు చెందిన దయారాం. దిందోరీ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది దయారాం సాహుకు గాజు పెంకులంటే ప్రాణం. బాటిల్ కనిపిస్తే చాలు.. అతడికి నోరూరుతుంది. వెంటనే దాన్ని ఖాళీ చేసి పరపరా నమిలేయాలనేంత ఆశ పుడుతుంది. అందుకే ఇంట్లో వాళ్లు ఆయనకు గాజు సీసాలను దూరంగా పెడతారు. దయారాం 40 ఏళ్లుగా గాజు పెంకులు తింటున్నట్లు జాతీయ వార్త సంస్థకు తెలిపాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement