dindori
-
దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి..
దిండోరి: మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
వైరల్ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు
దిందోరీ : కొందరికి తరచూ టీ తాగడం, మరికొందరికి సిగరేట్ తాగడం.. ఇంకొందరికి మద్యం సేవించడం... ఇలాంటి అలవాటు ఉంటాయి. కానీ గాజు ముక్కలు తినడం ఎవరికైనా అలవాటు ఉంటుందా? నాకు ఉందని చెబుతున్నాడు మధ్య ప్రదేశ్‌కు చెందిన దయారాం. దిందోరీ ప్రాంతంలో నివసిస్తున్న న్యాయవాది దయారాం సాహుకు గాజు పెంకులంటే ప్రాణం. బాటిల్ కనిపిస్తే చాలు.. అతడికి నోరూరుతుంది. వెంటనే దాన్ని ఖాళీ చేసి పరపరా నమిలేయాలనేంత ఆశ పుడుతుంది. అందుకే ఇంట్లో వాళ్లు ఆయనకు గాజు సీసాలను దూరంగా పెడతారు. దయారాం 40 ఏళ్లుగా గాజు పెంకులు తింటున్నట్లు జాతీయ వార్త సంస్థకు తెలిపాడు. ‘ఇది నాకు ఒక వ్యసనం. దీనివల్ల నా పళ్లు దెబ్బతిన్నాయి. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలని అనిపించేది. మొదటగా గాజు తిన్నప్పుడు కొంచెం రుచిగా అనిపించింది. నేను గాజు తింటున్నానని తెలియడంలో ప్రజలు ఆశ్చర్యపోయారు. నన్ను ప్రత్యేకంగా చూశారు. దీంతో నేను ఇంకా ఎక్కువ గాజులు తినడం మొదలెట్టాను. ఇప్పుడు ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఇలా గాజు పెంకులు తినాలని నేను ఎవరూ సూచించను. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. నేను కూడా వీటిని తినడం బాగా తగ్గించాను’అని దయారాం సాహు తెలిపారు. -
వైరల్ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు
-
ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
డిండోరి: మధ్యప్రదేశ్‌లోని డిండోరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ బోల్తా పడటంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది.