
కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును..
సాక్షి, న్యూఢిల్లీ: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గాజు గుర్తును కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గుర్తును మళ్లీ కేటాయించింది.
దీంతో ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. "జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు’’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.
గ్లాస్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు - JanaSena Chief Shri @PawanKalyan #VoteForGlass pic.twitter.com/yxWjWbbAXp
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2023