
రామ్ చరణ్.. ఓ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చెర్రీ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ‘ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడే ప్రచారం చేయాలని చేద్దామనుకున్నా. కానీ, అప్పుడు బాబాయ్ పవన్ కల్యాణ్ వద్దన్నారు. ఇప్పుడు బాబాయ్ చాలా కష్టపడుతున్నారు. ఆయన గనుక అనుమతి ఇస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని రామ్ చరణ్ తెలిపారు.
చెర్రీ తాజా వ్యాఖ్యలపై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చెర్రీ గతంలో పలుమార్లు పవన్‌కే తన మద్ధతు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.