
మైసూరు: సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలే పోతాయని అనేకసార్లు రుజువైంది. సామాజిక మాధ్యమాల్లో తమ ఇద్దరి ఫోటో వైరల్‌గా మారడంతో ఇరు కుటుంబాల ఘర్షణ పడగా, మనస్తాపానికి గురై గృహిణి, మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. హుణసూరులోని కల్కుణి నివాసి వివాహిత శృతి (28), మురళి (20) ఆత్మహత్య చేసుకున్నవారు.
వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరు కలసి ఉన్న ఫోటోను మురళి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోగా ఊళ్లో చాలామంది అది చూశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో భయపడిపోయిన శృతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలిసి మురళి కూడా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు.