నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా ఎన్నో క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది.
అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య మా ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉండటం వల్ల నటించేందుకు సమయం లేదని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇక ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకున్న నేపథ్యంలో తన వారసురాలిగా కూతురిని సినిమా రంగంలో దించేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో హేమ కుతురి గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్ కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే హేమ కూతురు పేరు ఇషా. ఆమె మీడియా, సోషల్ మీడియాకు దూరం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇషాకు 22 ఏళ్లు. ఇటీవల ఆమె బీబీఏ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక చదువు పూర్తి చేసుకున్న ఇషా సినిమాల్లో వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ, తన కూతురిని సినీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని గతంలో హేమ చాలాసార్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
చదవండి:
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
విజయ్ సేతుపతితో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment