Kareena Kapoor Second Son Jehs Picture Goes Viral - Sakshi
Sakshi News home page

Kareena Kapoor: తైమూర్‌ తమ్ముడు ఇతడేనా? ఫోటో వైరల్‌

Published Fri, Jul 16 2021 10:37 AM | Last Updated on Fri, Jul 16 2021 12:00 PM

Kareena Kapoor Second Son Jehs Picture Goes Viral - Sakshi

బాలీవుడ్‌ స్టార్స్‌ కరీనా కపూర్‌-సైఫ్‌ అలీఖాన్‌ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలి సంతానం తైమూర్‌ కాగా, రెండో బిడ్డకు  ‘జెహ్‌’ అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు జెహ్‌కు సంబంధించి ఫోటోను చూపించలేదు. తైమూర్‌ అడపాదపడా మీడియా కంటికి చిక్కినా.. రెండో కుమారుడు ‘జెహ్‌’ను మీడియా కంటికి చిక్కకుండా కరీనా జంట జాగ్రత్త పడుతూ వచ్చారు. తాజాగా జెహ్‌ ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇటీవలీ కరీనా తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్‌కు ఆమె ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్‌తో విడుదల చేసింది. ఈ పుస్తకంలోని ఒక పేజీలో కరీనా చిన్నారిని ముద్దుచేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది.

అయితే ఇందులో కనిపిస్తుంది కరీనా రెండో కుమారుడు 'జెహ్‌' అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఇది జెహ్‌ ఫోటోనే  అని ఫిక్సయిపోయి ఈ ఫోటోను తెగ షేర్‌ చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్‌ అలీఖాన్‌ గతంలో అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్‌, ఇబ్రహీమ్‌ అలీఖాన్‌. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్‌ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016 డిసెంబర్‌లో తైమూర్‌ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత జెహ్‌ పుట్టాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement