
వర్క్ ఫ్రం హోమ్ మనుషులను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకువచ్చిందంటే వాళ్ల వ్యక్తిగత విషయాలకు కూడా టైం కేటాయించలేని స్థితికి తీసుకు వచ్చింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి చాలా వరకు కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులబాటు ఇచ్చినట్లు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకోవడం ప్రారంభించాయి. ఆఖరికి ఇంటి వద్దనే కదా ఉండేదని వారాంతపు సెలవులను కూడా తగ్గించేశాయి కొన్ని కంపెనీలు.
ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకి వచ్చేయమని చెప్పాయి. అయినప్పటికీ చాలామంది ఉద్యోగులు దీనికి అలవాటుపడిపోయి ఆఫీసుకు రండి బాబు అని కంపెనీలు బతుమాలుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని కంపెనీలు ఇదే బెటర్ అంటూ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది దీనికే అలవాటు పడిపోయి తమ వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించకుండా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.
అచ్చం అలానే ఇక్కడొక పెళ్లి కొడుకు తన పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌పై ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ కళ్యాణ మండపంలో ఇద్దరు పూజారులు మంత్రాలు చదువుతుండగా సదరు పెళ్లికొడుకు పెళ్లీపీటలపై కూడా ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతను ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్‌చల్ చేసింది.
దీంతో నెటిజన్లు మండిపడుతూ..ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. ఏ కంపెనీ కూడా ఆఖరికి పెళ్లి సమయంలో కూడా పనిచేయమని అడగరు. ఇతని జీవితాన్ని, కెరియర్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియడం లేదు అంటూ ఫైర్ అయ్యారు. మరికొందరు అతడికి వచ్చే భార్య ఎవరో ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: తన జుట్టును తానే తింటున్న బాలిక.. చివరికి ఆహారం....)
Comments
Please login to add a commentAdd a comment