![Kajal Agarwal Shares Her Son Photo Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/13/kajuj.jpg.webp?itok=7k4PgwFT)
Kajal Agarwal Shares Her Son Photo Goes Viral: ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. అయితే ఇప్పటివరకు కాజల్ తన కుమారుడిని చూపించలేదు. కొడుకుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసినప‍్పటికీ ముఖం మాత్రం ఎక్కడా కనిపించకుండా పోస్ట్ చేసింది. తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కాజల్.
ఈ ఫొటోలో మాత్రం ఆ చిన్నారి ముఖం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫొటోలో బాబును కాజల్ ఒకవైపుకు ఎత్తుకుని బెడ్‌పై పడుకుని ఉండగా, చిన్నారి ఫేస్‌కు అతని చేయి కొంచెం అడ్డంగా రావడం మనం చూడొచ్చు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోను కాజల్ అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. చాలా క్యూట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు తమ పిల్లల ఫొటోలను పూర్తిగా చూపించకుండ ఉండేందుకుక రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా తమ కూతురు ఫొటో ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తపడిన విషయం తెలిసిందే.
చదవండి: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment