IPL 2023: RCB Die Hard Fan Girl Crying After RCB Loss Against LSG, Goes Viral - Sakshi
Sakshi News home page

RCB Fan Girl Crying Pic: ఎటు చూసినా దుఃఖమే.. మ్యాచ్‌ ఓడిపోతే ఇంతలా ఏడుస్తారా!

Apr 11 2023 5:38 PM | Updated on Apr 11 2023 11:10 PM

IPL 2023: Die-Hard RCB Fan Shed Tears-Close Loss Match To-LSG Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సోమవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌ చూస్తున్న అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో జరిగిన హైడ్రామా బహుశా ఇంతకముందు ఐపీఎల్‌ చరిత్రలో చూసింది  లేదనుకుంటా. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో నికోలస్‌ పూరన్‌, మార్కస్‌ స్టోయినిస్‌లు మ్యాచ్‌ను దాదాపు వన్‌సైడ్‌ చేశారు. వీరికి ఆయుష్‌ బదోని కూడా తోడయ్యాడు.

అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మళ్లీ ఆర్‌సీబీవైపు మొగ్గినట్లుగా అనిపించింది. ఇక ఆఖరి ఓవర్లో లక్నోకు ఐదు పరుగులే కావాల్సినప్పటికి హర్షల​ పటేల్‌ చక్కగా బౌలింగ్‌ చేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. అయితే బిష్ణోయ్‌ను మన్కడింగ్‌ చేసే క్రమంలో చేసిన పొరపాటు.. దానికి తోడు కీపర్‌ కార్తిక్‌ తడబాటుతో ఆర్‌సీబీ మ్యాచ్‌ను లక్నోకు కోల్పోవాల్సి వచ్చింది.

ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఇది రెండో ఓటమి. మాములుగానే ఆర్‌సీబీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంటుంది. పైగా సొంత స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుందంటే ఆర్‌సీబీ మరింత బలంగా కనిపిస్తుంది. అయితే మ్యాచ్‌ తమ చేతులోకి వచ్చేసిందని సంబరపడేలోపు లక్నో మ్యాచ్‌ను లాగేసుకోవడంతో ఆర్‌సీబీ అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే ఆఖరి బంతికి ఆవేశ్‌ ఖాన్‌ సింగిల్‌ తీసి లక్నోను గెలిపించగానే స్టేడియం ఒక్క నిమిషం పాటు సైలెంట్‌ అయిపోయింది. ఎవరి మొహాల్లో తొంగి చూసినా దుఃఖమే కనిపిస్తోంది. 

ఈ క్రమంలో ఆర్‌సీబీకి డైహార్డ్‌ అభిమాని అయిన ఒక యువతి కంటతడి పెట్టడం అందరిని బాధించింది. ఆర్‌సీబీ ఓడింది ఫైనల్‌ మ్యాచ్‌ కానప్పటికి.. అరె గెలిచే మ్యాచ్‌ ఓడామే అన్న బాధ ఆ యువతిలో కనిపించింది. అందుకే ఎంత ఓదారుస్తున్న యువతి ఏడ్వడం ఆపలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ ''యువతిని చూస్తే జాలేస్తోంది.. లీగ్‌ మ్యాచ్‌ ఓడితే ఇంతలా ఏడుస్తారా''.. ''ఒకవేళ ఆర్‌సీబీకి ఫైనల్‌ మ్యాచ్‌లో ఇలా జరిగి ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ స్టేడియానికి మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement