సినీ ప్రపంచం, ఫ్యాషన్ వరల్డ్‌లో కొత్తదనానికే మొదటి ప్రాధన్యత. దాంతో సినీ జనాలు, మోడళ్లు ఫ్యాషన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటారు. కొత్త ట్రెండ్స్‌ను పరిచయం చేస్తారు. ఈ విషయంలో అక్కినేని వారి కోడలు సమంత ఓ అడుగు ముందే ఉంటారని చెప్పవచ్చు. దుస్తుల విషయంలో గానీ, ఆభరణాల విషయలో గానీ ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తుంటారు సమంత. (సమంత బ్యూటీ థెరపీ వీడియో )
తాజాగా సమంత ఇయర్ రింగ్స్ తెగ ట్రెండ్ అవ్వడమే కాక యువతులును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. వీటిలో సమంత ఏకంగా ఐదు చిన్న చిన్న చెవి దుద్దులు ధరించారు. డైమండ్, ఇతర మెటల్స్‌తో తయారు చేసిన ఈ చిన్న చిన్న స్టడ్స్ యువతులను తెగ ఆకర్షిస్తున్నాయి. ‘న్యూ పియర్సింగ్స్’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ‘సూపర్బ్.. ఫ్యాషన్‌లో మీకు మీరే సాటి’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. మీరు చూసి.. నచ్చితే ఫాలో అవ్వండి.
Comments
Please login to add a commentAdd a comment