Prithvi Shaw Learning Garba Steps Gorgeous Mystery Girl Nidhhi Tapadiaa - Sakshi

ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరంటే..

Oct 1 2022 7:38 PM | Updated on Oct 1 2022 8:10 PM

Prithvi Shaw Learning Garba Steps Gorgeous Mystery Girl Nidhhi Tapadiaa - Sakshi

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయాడా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. పృథ్వీ కొంతకాలంగా నటి నిధి తపాడియాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజగా దసరా నవరాత్రులు పురస్కరించుకొని పృథ్వీ షా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ నిధి తపాడియాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

అంతేకాదు నిధి తపాడియా వద్ద గర్బా డ్యాన్స్‌కు సంబంధించిన మెళుకువలను నేర్చుకున్నట్లు సమాచారం. తాజాగా అమ్మవారి ముందు పృథ్వీ షా, నిధి తపాడియాలు దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. మరి పృథ్వీ మనసు దోచుకున్న నిధి తపాడియా ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో ఉంది.

నిధి తపాడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెన్సేషన్‌.సోషల్‌ మీడియాలో ఆమెకు దాదాపు 104K ఫాలోవర్స్‌ ఉండడం విశేషం.స్వతహగా మంచి సింగర్‌ అయిన ఆమె మోడల్‌గా, నటిగానూ రాణిస్తోంది. తన అందంతో, టాలెంట్‌తో యువత మనసులను దోచుకుంటుంది.

ఇక భారతదేశంలో పాపులర్‌ టీవీ సిరీస్‌ల్లో ఒకటైన సీఐడీలో నిధి తపాడియా నటించింది. కొన్ని ఎపిసోడ్లలో ఆమె తన నటనతో మెప్పించింది. ఇక నిధి తపాడియాకు జట్టా కొకా అనే వీడియో సాంగ్‌ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ పాటను పంజాబ్‌ లెజెండరీ సింగర్‌ కుల్వీందర్‌ బిల్లా పాడాడు. ఇటీవలే టోనీ కక్కర్‌ 'కిస్‌ యూ' అనే వీడియో సాంగ్‌లో మరోసారి తన అందచందాలతో కట్టిపడేసింది.

ఇక టీమిండియాలోకి యువ కెరటంలా దూసుకొచ్చిన పృథ్వీ షా ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్‌ ఉంటుంది. ఓపెనర్‌గా జట్టుకు దూకుడైన ఆరంభాలను అందించడంలో ముందు వరుసలో ఉంటాడు. టీమిండియా తరపున పృథ్వీ షా 4 టెస్టులు, ఆరు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇంతకముందు పృథ్వీ షా ప్రాచిసింగ్‌ అనే అమ్మాయితోనూ ప్రేమ వ్యవహారం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

చదవండి: బుమ్రా విషయంలో కోచ్‌ ద్రవిడ్‌ క్లారిటీ

గర్బా డ్యాన్స్‌తో అలరించిన నీరజ్‌ చోప్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement