
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయం టాక్ ఆఫ్‌ది టౌన్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఏ విషయమైన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment