
రైతు మృతదేహం వద్ద ఎమ్మెల్యే తదితరులు
కర్ణాటక, తుమకూరు: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మృతదేహం వద్ద ఫోటో తీయించుకున్న ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. శిర తాలూకా దేవరహళ్లి గ్రామానికి చెందిన రైతు గంగాధర్ (60) సేద్యం కోసం రూ.రూ.4.50 లక్షల వరకూ అప్పు చేశాడు. పంటలు పండక అప్పులు తీర్చే మార్గం కనిపించక బుధవారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రైతు మృతదేహం చెట్టుకు వేలాడుతుండగానే ఫోటోలకు ఫోజులివ్వడం అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment