
సాక్షి, ఛండీగఢ్ : పంజాబ్‌లోని గురదాస్‌పూర్ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ ఎలక్షన్ కమిషన్‌ను కోరింది. కాగా నటుడు వినోద్ ఖన్నా మరణంతో ఖాళీ అయిన గురుదాస్‌పూర్ నియోజక వర్గానికి ఎన్నికల సంఘం అక్టోబర్ 11 ఉప ఎన్నిక నిర్వహించబోతుంది. మరో ఆరురోజుల్లో ఎన్నికలు ఉండగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడం బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment