
ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోంది. రంజాన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. మన హైదరాబాద్ హాలీం అంటే ఇష్టపడి వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఈ రంజాన్ సీజన్ వస్తే చాలు హాలీం షాపుల వద్ద హైదరాబాదీలు క్యూ కడుతుంటారు. అలాగే స్టార్ హీరో నాగచైతన్య కూడా హాలీం కోసం హైదరాబాద్ రోడ్డుపైకి వచ్చారు. మాసబ్ ట్యాంక్‌లోని ఓ రెస్టారెంట్‌లో సందడి చేశాడు.
చదవండి: పిల్లలంటే ఇష్టం.. అందుకే పెళ్లికి ముందే అలా చేశా!: ప్రియాంక చోప్రా
అంతేకాదు అక్కడికి వచ్చిన కస్టమర్లతో కూడా చై మాటలు కలిపి వారికి సెల్పీలు ఇచ్చాడు. ఇక నాగ చైతన్య తమ రెస్టారెంట్‌ను విజిట్ చేయడంతో సదరు హోటల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. దీంతో తమ ఇన్‌స్టాగ్రామలో చైతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా తమ రెస్టారెంట్‌ను సందర్శించినందుకు నాగచైతన్యకు రెస్టారెంట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment