
తన సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటుడు ప్రసన్నతో జత కట్టి, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆయన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. పిల్లల విషయంలో స్నేహ, ప్రసన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
పిల్లలకు సంబంధించి ప్రతి విషయాన్ని అందమైన వేడుకగా నిర్వహించి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అదే విధంగా సంసార జీవితంలో దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కాగా గురువారం ప్రసన్న, స్నేహ కొడుకు పుట్టిన రోజు. ఈ బాబుకు ఇప్పుడు ఏడేళ్లు. దీంతో పిల్లలను రెడీ చేసే పనిలో భాగంగా స్నేహ తన ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు జలకాలాడారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment