
సాక్షి, సినిమా : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సంబంధించి తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో షర్ట్‌లెస్‌గా వర్కువుట్‌లు చేస్తున్న ఫోటో అది. అది అభిమానులు వావ్ అంటూ కామెంట్లు చేశారు.
అయితే అది ఫేక్ అని తేల్చేశాడు తారక్ పర్సనల్ ట్రైనర్ ల్లాయిడ్ స్టీవెన్స్. ‘అది ఫేక్ ఫోటో.. ఎవరు క్రియేట్ చేశారోగానీ వారికి హ్యాట్సాఫ్’ అంటూ ల్లాయిడ్ ట్వీట్ చేశాడు.
కాగా, కొన్నిరోజుల క్రితం తారక్ వర్కవుట్లతో కష్టపడుతున్న ఫోటో ఒకదానిని ల్లాయిడ్ పోస్ట్ చేసింది తెలిసిందే. ప్రస్తుతం రామారావు.. త్రివిక్రమ్ సినిమా కోసం షూటింగ్‌కు సిద్ధమవుతుండగా.. మరోవైపు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ ప్రకటన వెలువడింది తెలిసిందే.
Please kindly note this is a “FAKE” picture which someone has created ... hats off to their creativity though 😄 pic.twitter.com/KkYUKOjlvG
— Lloyd Stevens (@lloydstevenspt) 23 March 2018