Jr NTR Shares Photo With Wife Lakshmi Pranathi: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కొమురం భీమ్‌గా నటించిన నందమూరి నట వారసత్వం జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. సినిమాలతో ఎంత బిజిగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తాడు తారక్. అప్పుడప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా సోషల్ మీడియాలో తారక్ పెట్టిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శనమిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సోమవారం (ఆగస్టు 1) తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట వదిలాడు తారక్. ఓ బల్లపై వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చూడముచ్చటగా ఉంది. అలాగే చేతిలో కాఫీ కప్పుతో మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తున్న వీరి ఫొటోను షేర్ చేస్తూ 'ఇలాంటి క్షణాలు' అని రాసుకొచ్చాడు తారక్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన
బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక..
Comments
Please login to add a commentAdd a comment