moments
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)
-
మనసు నిండిపోయింది: బెస్ట్‌ఫ్రెండ్స్‌తో సానియా మీర్జా (ఫొటోలు)
-
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
ఐపీఎల్ 17లో బద్దలైన రికార్డ్‌లు
-
100th Test: అశ్విన్, జానీ బెయిర్ స్టో ఎమోషనల్ మూమెంట్స్.. పడిక్కల్ కూడా (ఫొటోలు)
-
నయన్-విఘ్నేశ్ క్రేజీ సెలబ్రేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?
-
ఈసారి రూ. 4.7 లక్షల కోట్ల వ్యాపారం..
న్యూఢిల్లీ: ఈసారి పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం భారీగా జరుగుతుందని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించిన కొనుగోళ్లు, ఇతరత్రా సర్విసులపై వినియోగదారులు రూ. 4.74 లక్షల కోట్ల మేర వెచ్చించే అవకాశం ఉందని భావిస్తోంది. గత సీజన్లో నమోదైన రూ. 3.75 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు అధికం. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు ఉన్న వివాహాల సీజన్లో దాదాపు 38 లక్షల పెళ్లిళ్లు జరగొచ్చని భావిస్తున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ విలేకరుల సమావేశం సందర్భంగా తెలిపారు. ‘గతేడాది సుమారు రూ. 3.75 లక్షల కోట్ల వ్యయంతో దాదాపు 32 లక్షల వివాహాలు జరిగాయి. ఈసారి ఇది దాదాపు రూ. 1 లక్ష కోట్లు మేర పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. దేశ ఎకానమీకి, రిటైల్ వ్యాపారానికి కూడా ఇది మంచిదే‘ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో 23, 24, 27, 28, 29 తేదీల్లో, అలాగే డిసెంబర్లో 3, 4, 7, 8, 9, 15 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల పైగా పెళ్లిళ్లు ఉంటాయని, వీటితో రూ. 1.25 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేస్తున్నట్లు ఖండేల్వాల్ తెలిపారు. -
ఆ నాలుగు రోజులే!
ఎన్నికల షెడ్యూల్ వెలువడి రెండు రోజులు గడిచాయో లేదో, చాలా మంది ఆశావహులు నామినేషన్ల మీద దృష్టి సారించేశారు. నమ్మకమైన పండితులను సంప్రదించి ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుందో వాకబు చేసేస్తున్నారు. వచ్చే నెల 3 నుంచి 10వతేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఎనిమిది రోజుల్లో నాలుగు రోజులు తిథి, నక్షత్ర బలం రీత్యా కీలకంగా ఉన్నాయి. ఆ నాలుగు రోజుల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. ఇక కొందరు నామ బలం రీత్యా ఇతర రోజుల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉన్నా, ఎక్కువ మంది మాత్రం ఆ నాలుగు రోజుల్లోనే వేస్తారని అంచనా వేస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ మొదటి స్థానంలో..నవంబర్ 3 ఉత్తర నక్షత్రంతో కూడిన గురువారం ఆ రోజు. విష్ణు తిథిగా పేర్కొనే ఏకాదశి. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇది నామినేషన్ల ఘట్టం ముగియటానికి సరిగ్గా ముందు రోజు కావటం విశేషం. రెండో స్థానంలో ...నవంబర్ 4 పుబ్బ నక్షత్రంతో కూడిన బుధవారం. దశమి తిథి. ఆరోజు గురు, కుజ బలం బాగా ఉన్న రోజుగా పంచాంగం చెబుతోంది. ధన బలం కూడా మెండుగా ఉండే రోజుగా పండితులు పేర్కొంటున్నారు. ఆ రోజు నామినేషన్ వేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారని చెబుతున్నారు. మూడో స్థానంలో...నవంబర్ 8 శ్రీరామ చంద్రుల వారి నక్షత్రం అయిన పునర్వసు ఉన్న శుక్రవారం రోజు కావటంతో ఈ రోజుకు ప్రాధాన్యం ఉందని పండితులు పేర్కొంటున్నారు. నామినేషన్ల పర్వం తొలిరోజు అయిన మూడో తేదీన ముస్లిం మైనారిటీలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. వారు పవిత్రంగా భావించే శుక్రవారం కావటమే దీనికి కారణం. నాలుగో స్థానంలో ...నవంబర్ 9 సప్తమి తిథితో కూడిన శనివారం. ఆ రోజు పునర్వసు–పుష్యమి నక్షత్రాలు ఆ రోజుపై ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ రెండు తిథులు కలిసి ఉండటం మహారాజయోగంగా భావిస్తారు. ఈ నాలుగు రోజుల్లో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తారని, ఇప్పటికే నేతలు ఈమేరకు వివరాలు తెలుసుకుని ఖాయం చేసుకున్నారని ప్రముఖ జ్యోతిష పండితులు కిరణ్ శర్మ చెబుతున్నారు. మంగళవారానికే వారి మొగ్గు.. మంగళవారం మంగళకరమైన రోజుగా భావించి ఆ రోజే పనులు చేపట్టేందుకు మొగ్గుచూపేవారూ ఉన్నారు. ఆ కోవలో కొందరు రాజకీయ నేతలు మంగళవారం రోజే నామినేషన్లు వేస్తారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత, ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఓ నియోజకవర్గానికి చెందిన నేత, బీజేపీ కీలక నేత ఒకరు, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఓ సీనియర్ నేత ఇలా కొందరు ఈరోజుకు ప్రాధాన్యం ఇస్తారు. అప్పుడే పరిహారాలకు కూడా ఏర్పాట్లు.. రాజకీయ భవిష్యత్‌ను ఓటర్లు ఎలా నిర్ణయించే అవకాశం ఉందో చెప్పమని నేతలు పండితుల వద్ద క్యూ కడుతున్నారు. పుట్టిన తేదీ, వారి నక్షత్రం.. ఇలా గోచార బలాన్ని తెలుసుకుంటున్నారు. సిటీకి చెందిన ఓ మంత్రికి ఈసారి అనుకూల యోగం లేదన్న సమాచారంతో వారి కుటుంబం పరిహార పూజలు ప్రారంభించిందట. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఓనేత తరపున ఆయన భార్య పూజల్లో నిమగ్నమయ్యారట. ‘‘మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది’’ కారు గుర్తు కేటీఆర్ మాట ఇది. ‘‘డ్రైవింగ్ ఎవరు చేస్తుంటే, స్టీరింగ్ వాళ్ల చేతుల్లోనే ఉంటది? ఇందులో ఆశ్చర్యం ఏముంది?’’కామన్‌మేన్ సందేహం. ‘‘అభివృద్ధికి అరడజన్ సూత్రాలు చాలు.. అంటే, ఆరు గ్యారంటీలు చాలు’’కాంగ్రెస్ ‘‘అరడజన్ సీఎంలలో అందరూ ఎలిజిబుల్స్... ఈ బుల్స్ మధ్య రేపు బుల్‌ఫైట్ జరిగి... రాష్ట్రం రాష్ట్రమంతా ‘బుల్ ఇన్ చైనా షాప్’కాదని గ్యారంటీ ఏమిటీ’’... మళ్లీ కామన్‌మేన్ సంశయం. -
Virat Kohli Completes 15 Years In International Cricket: విరాట్ కోహ్లి @ 15 ఏళ్లు.. కింగ్ అరుదైన ఫొటోలు చూశారా?
-
హీరో ఆర్య కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఉగ్ర కుట్రలో కొత్త ట్విస్ట్ లు
-
హైదరాబాద్ ఉగ్ర కదలికల్లో కీలక అంశాలు
-
పెళ్లిళ్లకు బ్రేక్.. అప్పటి దాకా ఆగాల్సిందే.. నో ఛాన్స్
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): చిన వేంకన్న క్షేత్రం ద్వారకా తిరుమలలో శ్రావణ మాస పెళ్లిసందడికి తెర పడింది. ఆదివారం ఉదయం 8.39 గంటలదే శ్రావణంలో చివరి ముహూర్తం. ఈ ముహూర్తంలో కొన్ని వివాహాలు జరిగినా.. శనివారం రాత్రి ముహూర్తం శ్రావణ మాసంలో అతి పెద్దది కావడంతో క్షేత్రంలో 300కు పైగా వివాహాలు జరిగాయి. దీంతో ఇసుక వేస్తే రాలనంత జనంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఎటు చూసినా పెళ్లివారే కనిపించారు. కొండ పైన, దిగువన ఉన్న కల్యాణ మంటపాలు, తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మంటపం, పాదుకా మంటపం వద్ద ఉన్న స్వామివారి కల్యాణ మంటపంలో, చివరకు ఆలయ ప్రధాన రాజగోపుర మెట్ల మార్గం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో నేలపై సైతం వివాహాలు జోరుగా జరిగాయి. స్వామి సన్నిధిలో కాస్త జాగా దొరికితే చాలు.. ఏదోలా పెళ్లి చేసుకుని వెళ్లిపోదామని పెళ్లి బృందాల వారు ఆతృత పడ్డారు. పెళ్లివారి వాహనాలతో ఘాట్ రోడ్లన్నీ కిక్కిరిశాయి. క్షేత్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్సై టి.సుదీర్ సిబ్బందితో కలసి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మొత్తంగా శ్రావణ మాసంలో శ్రీవారి క్షేత్రంలో సుమారు 2 వేల వివాహాలు జరిగాయి. దేవస్థానానికి కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. స్వామి సన్నిధిన వివాహాలు చేసుకున్నవారే కాకుండా ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. సత్రం గదుల్లో చాలావరకూ పెళ్లిబృందాల వారే రిజర్వ్ చేసుకున్నారు. పెళ్లిళ్లకు మూడు నెలలు బ్రేక్.. శ్రీవారి క్షేతంల్రో వివాహాలు జరగాలంటే మార్గశిర మాసం వరకూ అంటే డిసెంబర్ రెండో తేదీ వరకూ ఆగాల్సిందే. ఆదివారంతో శ్రావణ మాసంలోని వివాహ ముహూర్తాలు ముగిశాయి. 28 నుంచి భాద్రపదం శూన్యమాసం. ఆ తరువాత సెప్టెంబర్ 18 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబర్ 27 వరకూ వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లు జరుపుకొనేందుకు అనేక మంది తొందరపడ్డారు. దీంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. డిసెంబర్ 2 నుంచి 19వ తేదీ వరకూ మళ్లీ పెళ్లి ముహూర్తాలున్నాయి. ఆ తరువాత పుష్యమాసం కావడంతో డిసెంబర్ 24 నుంచి జనవరి 21 వరకూ ముహూర్తాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న మాఘమాసంలో, తరువాత ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమవుతున్న ఫాల్గుణంలో వివాహాలు జరగనున్నాయని పండితులు తెలిపారు. కొత్త జంటలతో క్షేత్రం కళకళ కొత్త జంటలతో శ్రీవారి క్షేత్రం కళకళలాడింది. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా వివాహాలు జరిగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి కొత్త జంటలు, వారి బంధువులతో కలసి ఆలయానికి తరలి వచ్చారు. ఆలయం వద్ద ఎటు చూసినా నూతన వధువరులే కనిపించారు. దీనికితోడు ఆదివారం సెలవు కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. -
భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్
Jr NTR Shares Photo With Wife Lakshmi Pranathi: దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్ఆర్ఆర్' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో కొమురం భీమ్‌గా నటించిన నందమూరి నట వారసత్వం జూనియర్ ఎన్టీఆర్‌కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. సినిమాలతో ఎంత బిజిగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తాడు తారక్. అప్పుడప్పుడు తన వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వదులుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా సోషల్ మీడియాలో తారక్ పెట్టిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శనమిచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సోమవారం (ఆగస్టు 1) తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట వదిలాడు తారక్. ఓ బల్లపై వీరిద్దరూ ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చూడముచ్చటగా ఉంది. అలాగే చేతిలో కాఫీ కప్పుతో మాట్లాడుకుంటూ ఆస్వాదిస్తున్న వీరి ఫొటోను షేర్ చేస్తూ 'ఇలాంటి క్షణాలు' అని రాసుకొచ్చాడు తారక్. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?.. ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే
ఖమ్మం (భద్రాచలం అర్బన్) : వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా.. శుభ ముహూర్తం కోసం వెతికి మరీ అదే రోజు, అదే సమయానికి సంప్రదాయంగా ప్రారంభించి మొదలుపెడతాం. ముఖ్యంగా వివాహాలకు అయితే కచ్చితంగా పాటించాల్సిందే. కోవిడ్ తర్వాత రెండేళ్లకు పెళ్లి మంత్రాలు మోగుతున్నాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు తమ పిల్లల వివాహాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఈ ఏడాది సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఉరుకులు, పరుగులతో పెళ్లిళ్లు కానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండడంతో అందరూ బిజీబిజీగా గడిపారు. కరోనాతో మోగని పెళ్లి బాజా.. రెండేళ్ల కరోనా కాలంలో చాలా మంది పెళ్లి మాట ఎత్తనేలేదు. కొంతమంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా వాయిదా వేశారు. కానీ, ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో కొత్త సంవత్సరం మొదలు జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగాయి. జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన ముహూర్తాలకు ఆగస్టులో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఆగడం ఎందుకని పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాల వారు తొందరపడుతూ పెళ్లిళ్లు చేస్తున్నారు. కోలుకుంటున్న వ్యాపారాలు .. కోవిడ్ కారణంగా వరుసగా రెండేళ్లు దెబ్బతిన్న వ్యాపారాలు ఈ ఏడాది జరిగిన వివాహాలతో కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వివాహాలు వేల సంఖ్యలో జరగడంతో శుభలేఖలు, దుస్తులు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్, పెళ్లి మండపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్ మేళాలు, కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు పెరగడంతో అన్నిరకాల షాపులు కళకళలాడుతున్నాయి. మిగిలిన ముహూర్తాలు ఇవే.. జనవరి నుంచి జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగినా.. జూలై ఆషాఢ మాసంతో మాత్రం బ్రేక్ పడింది. ఆగస్టు శ్రావణ మాసంలో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్‌లో బాద్రపద మాసం, శుక్ర మౌఢ్యమి ప్రారంభంలో, అక్టోబర్, నవంబర్‌లో శుక్ర మౌఢ్యమితో మంచి రోజులు లేవు. మళ్లీ డిసెంబర్లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మూడు నెలలు ఆగాల్సిందే.. ఆషాఢ మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో కేవలం 10 రోజులు మాత్రమే ము హూర్తాలు ఉండగా.. మళ్లీ డిసెంబర్లో మా త్రమే మంచి రోజులు ఉన్నాయి. దీనికోసం మూడునెలలు ఆగాలి్సందే. ఆపై ఉగాది వరకు కూడా ముహూర్తాలు లేనందున వీలైనంత తొందరగా తమ పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. – విశ్వనాథ్‌శర్మ, అర్చకులు, భద్రాచలం -
సామ్రాజ్య భారతి: 1901/1947 ఘట్టాలు, జననాలు...చట్టాలు
ఘట్టాలు: బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1901లో విడుదల చేసిన 10 రూపాయల నోటు తొలి ప్రామాణిక జనాభా లెక్కల సేకరణ చట్టాలు: ఇండియన్ టోల్స్ (ఆర్మీ అండ్ ఎయిర్‌ఫోర్స్) యాక్ట్ జననాలు: వి.శాంతారామ్ : సినీ దర్శకులు, నిర్మాత (కొల్హాపూర్); శ్యాం ప్రసాద్ ముఖర్జీ : జాతీయవాద నేత (కలకత్తా); జి.శంకర కురూప్ : మలయాళీ మహాకవి (కేరళ); పొట్టి శ్రీరాములు : స్వా.స.యో. (మద్రాస్ ప్రెసిడెన్సీ); రాజా చంద్రబోస్ : గణితశాస్త్రజ్ఞులు (మధ్యప్రదేశ్); రామకృష్ణ రంగారావ్ : బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు (మద్రాస్ ప్రెసిడెన్సీ); ధనంజయరావ్ గాడ్గిల్ : ఆర్థికవేత్త (మహారాష్ట్ర); పింగళి నాగేంద్రరావు : స్క్రీన్ రైటర్, పాటల రచయిత (రాజాం); నిర్మల్ కుమార్ బోస్ : పురావస్తు పరిశోధకులు (కలకత్తా); ప్రహ్లాద్ బాలాచార్య : భారత సుప్రీంకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తి (బాంబే ప్రెసిడెన్సీ) ; నట్వర్సిన్హ్జీ భావ్సిన్హ్జీ : పోర్బందర్ మహారాజా (గుజరాత్); సుధీంద్రనాథ్ దత్తా : బెంగాలీ కవి, విమర్శకులు (ఉత్తరప్రదేశ్); మొసలికంటి తిరుమలరావు : స్వా.స.యో. (పిఠాపురం); జి.ఎస్.మేల్కోటే : స్వా.స.యో. (ఒరిస్సా); జె.బి.హెచ్. వాడియా : సినీ దర్శకులు (బాంబే). -
పెళ్లి సందడి.. కల్యాణ ఘడియలొచ్చేశాయి..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్యాణ ఘడియలొచ్చేశాయి. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో జిల్లాలోను, నగరంలోనూ చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి షురూ కానుంది కొన్నాళ్లుగా కోవిడ్ భయంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి అయిన వారు మాత్రమే వివాహాలు జరిపించుకున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ ఒమిక్రాన్ భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో పాటు శుభ ముహూర్తాలు ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేటి నుంచే సందడి షురూ.. శనివారం నుంచి ఈనెల 16 వరకు 5, 6, 7, 10, 11, 12, 14, 16 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈనెల 20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉంటుంది. మౌఢ్యమి రోజులు అశుభంగా పరిగణించి పెళ్లిళ్లు, ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు జరిపించరు. గురు మూఢం ముగిశాక కూడా మార్చి 23 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. తిరిగి మళ్లీ ఏప్రిల్ 2 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్‌లో 2, 3, 6, 7, 13, 15, 16, 20, 21, 23, 24 తేదీలు అంటే పదకొండు రోజుల పాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే నెలలో 4, 11, 12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తాలున్నాయి. ముందు ముహూర్తాలకే ప్రాధాన్యం.. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ రూపంలో వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. వచ్చే రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. పైగా కొద్ది రోజుల నుంచి కోవిడ్ తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొన్నాళ్ల పాటు వేచి ఉండకుండా ముందుగా వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తగ్గించుకుంటున్న పెళ్లి ఖర్చులు.. గతంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపించేవారు. స్తోమతను బట్టి లక్షలు, కోట్ల రూపాయలను వెచ్చించే వారు. ఇదంతా కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కరోనా భయంతో పాటు కోవిడ్ ఆంక్షలతో ఎంతటి స్థితిమంతులైనా ఆర్భాటాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివాహ వేడుకలకు పరిమితులు విధించడంతో మునుపటిలా వందలు, వేల మందిని ఆహా్వనించడం లేదు. పురోహితులకు డిమాండ్.. ఇక ఈ నెలలో కేవలం ఎనిఠిమిది రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలుండడంతో పెళ్లి పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. విజయవాడలో దాదాపు 1500 మంది పురోహితులున్నారు. వివాహానికి స్థాయిని బట్టి పురోహితులు రూ.30–60 వేల వరకు తీసుకుంటారు. కల్యాణ మండపాలకు గిరాకీ.. మరోవైపు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ కనిపిస్తోంది. పెళ్లిళ్లు రెండు, మూడు నెలల ముందుగానే నిశ్చయమవడంతో అప్పట్లోనే వీటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ నగరంలోని వివాహ వేదికలు ఖాళీ లేకుండా పోయాయి. బెజవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 కల్యాణ మండపాలున్నాయి. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు మరో 70 వరకు నడుస్తున్నాయి. ఈ నెలలో జరిగే పెళ్లిళ్లకు ఇవన్నీ దాదాపు బుక్ అయినట్టు చెబుతున్నారు. కొందరు ధనికులు పేరున్న హోటళ్లలో వివాహాలు జరిపించుకుంటున్నారు. విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లలో 4,500 వరకు గదులుండగా వీటిలో సగటున 50 శాతానికి పైగా పెళ్లిళ్లకు బుక్ అయ్యాయి. నగరపాలక సంస్థ కల్యాణ మండపాలకు ఒక రోజు అద్దె రూ.10–15 వేలు, వీఎంసీ ఐవీ ప్యాలెస్ రూ.లక్ష ఉంది. ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ.. కోవిడ్ భయంతో చాన్నాళ్లుగా వివాహ వేడుకలను తగ్గించుకున్నారు. దీంతో ఆతిథ్య రంగం బాగా నష్టపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో మంచి ముహూర్తాలుండడంతో నగరంలోని హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ 50 శాతం వరకు పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. – ముప్పవరపు మురళీకృష్ణ, మెంబర్, విజయవాడ హోటలీయర్స్ అసోసియేషన్ ఈ నెలలో మంచి ముహూర్తాలు.. మాఘమాసం (ఫిబ్రవరి)లో సెంటిమెంటుగా భావించి పెళ్లిళ్లు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ నెలలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో వివాహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. – కృష్ణశాస్త్రి, పురోహితుడు, విజయవాడ -
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఇంట్లో పంచండి ఈ ఫొటోలో కనపడుతున్న ఇల్లు భలే ఉంది కదా. రెండు నిమిషాల్లో సొంతం చేసుకోవచ్చు. సింపుల్.. www.coveed.in అనే వెబ్సైట్లోకి వెళ్లి.. అందులో కనిపించే మోడల్స్‌లో ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంటి ప్రింట్‌ను తీసుకొని, ఆ ప్రింట్‌ను అందులో ఉన్న డిజైన్లోకి అసెంబుల్ చేసుకొని. అంటే పిజా బాక్స్‌లాగా అన్నమాట. ఆ ఇంట్లోని గదుల్లాంటి డబ్బాల్లో సరుకులను నింపి.. కరోనా లాక్డౌన్లో సొంతూళ్లకు వెళ్లలేకపోయిన వలస కూలీలకు, అన్నార్తులకు ఇవ్వచ్చు. దీనికి ఈ తతంగమంతా ఎందుకు? డైరెక్ట్‌గా డబ్బాల్లోనే సరకులను పోసి ఇస్తే పోలా? అని నిట్టూర్చకండి. ‘ఇల్లులాంటి డబ్బాల్లో వాళ్లకు కావల్సిన పదార్థాలను పెట్టి ఇవ్వడం వల్ల కుటుంబంలో ఆత్మీయతను పంచే సొంత మనుషుల మధ్యలో ఉన్న భావన వాళ్లకు కలుగుతుంది.. భయం తగ్గి.. ఆత్యస్థయిర్యం పెరుగుతుంది. ఎందుకంటే కూటికోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఆ కూలీలకు ఈ కష్టకాలంలో అన్నంతోపాటు ఆప్యాయతనూ పంచి.. ఇంటి మీద బెంగను మరిపించాలి’ అంటారు లక్ష్మీమీనన్. ఆమె ఎవరు? కేరళకు చెందిన లక్ష్మీ మీనన్ సోషల్ ఎంట్రప్రెన్యూర్. ‘పూర్ లివింగ్’ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. కరోనా కష్టకాలంలో వలస కూలీలు, నిరాశ్రయులతోపాటు ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌గా ఉన్న నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు, ఆహారపదార్ధాలను పంచేందుకు ’coveed for covid’ అనే పేరు మీద ఇలా ఇళ్లతో సేవలను అందిస్తున్నారు. coveed లోని వీడ్... వీడు .. అంటే మలయాళంలో ఇల్లు అని అర్థం. వెబ్‌సైట్‌లోని మోడల్స్‌లోని నచ్చిన ఇళ్లను ప్రింట్‌గా తీసుకొని దానికి కొంత మన సృజననూ జోడించి మరింత అందంగా తీర్చి.. వాటి మీద స్ఫూర్తిని చాటే మెసేజ్‌నూ రాసి మరీ సరకులను డొనేట్ చేయొచ్చు. ఇలాంటì క్రియేటివ్ సర్వీస్ లక్ష్మీ మీనన్‌కు కొత్త కాదు. కేరళకు వరదలు వచ్చినప్పుడూ ఇలాగే వినూత్న ఆలోచనలతో సేవలను అందించారు. ‘అవసరంలో ఉన్నప్పుడే సహాయం కోసం చూస్తారు. ఆ సహాయాన్ని కాస్త శ్రద్ధగా అందిస్తే.. అవతలి వాళ్లకు జీవితం మీద కొత్త ఆశ చిగురుస్తుం ది. అదే వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది. కరోనా కష్టంలో మనుషులకు కావాల్సింది ఆ ధైర్యమే. అది ఇల్లు మాత్రమే ఇవ్వగలదు. అందుకే ఈ ’coveed for covid’ అంటారు మీనన్. చదవడం లేదట! పిల్లలు బొత్తిగా పుస్తకం పట్టడం లేదని ఇక్కడ ఒక తండ్రి వాపోతున్నాడు. ఆ తండ్రిగారు క్రిస్ హెమ్స్‌వర్త్. ఆస్ట్రేలియన్ నటుడు. ‘అవెంజర్స్’ సీరీస్ లో ‘థోర్’ గా విఖ్యాతుడైన ఈ యోధుడు.. ఈ లాక్డౌన్లో పిల్లల్ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టి కనీసం ఒక గంటైనా చదివించలేక పోతున్నాడట! మూడు గంటలసేపు ‘బుజ్జీ.. కన్నా..’ అని బతిమిలాడితే ఇరవై అంటే ఇరవయ్యే నిముషాలు చదివి పుస్తకాలు పక్కన పెట్టేస్తున్నారని హెమ్స్‌వర్త్ కంప్లయింట్. ఈ హీరోగారికి ఏడేళ్ల కూతురు, ఆరేళ్ల కవల కుమారులు ఉన్నారు. కూతురు పేరు ఇండియా. అయినా ఏడేళ్లకు, ఆరేళ్లకు.. ఆ ఇరవై నిముషాలైనా.. చదవడం అటుంచి తిన్నగా కూర్చోవడం కూడా గొప్పేనని హెమ్స్వర్త్కి ఎందుకు అనిపించడం లేదో!! అన్నదమ్ములు స్థలం అమ్మితే వచ్చిన డబ్బుతో కాదు వీళ్లు సహాయం చేస్తున్నది. కేవలం సహాయం చేయడానికే స్థలం అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో అన్నార్తులను ఆదుకుంటున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో ఇద్దరు అన్నదమ్ములు ఈ లాక్డౌన్లో పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు సమకూర్చడానికి తమ ఇంటి స్థలాన్నే అమ్మేశారు! 25 లక్షల రూపాయలు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో వంట సామగ్రి కొని పంపిణీ చేస్తూ.. వంట చేసుకోలేని వాళ్ల కోసం ప్రత్యేకంగా వండిస్తూ రోజూ అన్నదానం చేస్తున్నారు. తజముల్ పాషా, ముజమిల్ పాషా అనే ఈ అన్నదమ్ములది చిక్‌బళ్లాపూర్ జిల్లా, చింతామణి తాలూకాలోని మొహ్మద్పూర్ గ్రామం. చిన్నవయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో కోలార్‌లో ఉంటున్న వీళ్ల అమ్మమ్మ చేరదీసి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ విద్యాబుద్ధులు ఇప్పుడు సమాజానికి ఉపయోగపడుతున్నాయి. పాటతో లాక్ చేశారు లాక్డౌన్ మనుషులకే కానీ మెదళ్లకు కాదు. పిల్లలను ఒక చోట నిమిషం పాటు కదలకుండా కూర్చోబెట్టడం కన్నవాళ్లకే సాధ్యం కాదు. అలాంటిది ప్రధానమంత్రికి చేతనవుతుందా? ఏ మాత్రం కాదు. లాక్డౌన్ టైమ్‌లో స్కూళ్లు లేవు. కొన్ని స్కూళ్లలో ఏదో ఓ రెండు గంటల సేపు ఆన్లైన్ క్లాసులుంటాయి. ఆ తర్వాత రోజంతా ఖాళీ. ఊరికే కూర్చోవడం పెద్దవాళ్లకు ఇష్టమవుతుందేమో కానీ పిల్లలకు కాదు. కరోనా సంక్షోభంలో అస్సామీ లవ్‌సాంగ్‌ను బయటకు తీసింది రూపాలి ప్రాణమిత అనే గడుగ్గాయి. ఆమె పాటకు సంగీతాన్ని సమకూర్చాడు మరో గడుగ్గాయి. ఈ పిల్లల క్రియేటివిటీని చూడమని చెప్తున్నది ఆ సంగీత సాధనాలే. చెట్టు మొదళ్లు, కర్ర పుల్లలు, వస్తువులు ప్యాక్ చేయడానికి వాడే అట్టపెట్టెలు, డబ్బా రేకు, రెండు చిన్న కర్ర పుల్లలు... వీటితో ఈ పిల్లలిద్దరూ నాలుగు లక్షల అరవై వేల మంది వీక్షకులను సాధించారు. 13 వేల లైక్‌లు సంపాదించారు. అంతకంటే ఎక్కువగా ప్రశంసలను సొంతం చేసుకున్నారు. వాలుజడను ముందుకు వేసుకుని పాటను ఆస్వాదిస్తూ, నీలిరంగు స్లిప్పర్స్‌లో దాగిన పాదాన్ని నేలకు సున్నితంగా తాటిస్తూ... సంగీతానికి అనుగుణంగా లయబద్ధంగా ఊగుతూ... అత్యంత ఆత్మవిశ్వాసంతో పాడింది ప్రాణమిత. చివరగా నమస్కారంతో ముగించింది. మూడున్నర నిమిషాల సేపు సాగిన ఈ పాటను ఫేస్బుక్లో చూసిన వాళ్లు ‘పాటలో సాహిత్యం అర్థం కాలేదు, కానీ పాటను ఆస్వాదించాను’ అని ఒకరు, ‘సంగీత సాధనాల ఏర్పాటులో పిల్లల సృజనాత్మకతకు ఫిదా అయిపోయాను’ అని ఒకరు ప్రశంసలు కురిపించారు. సంగీతానికి భాష లేదు, పిల్లలు చేసే ముచ్చటైన పనులకు ఆనందించడానికి మనసుకు ఎటువంటి పరిధులు ఉండవు. కొంతమంది సెలబ్రిటీలు లాక్‌డౌన్‌తో లైఫ్ బోరుకొడుతోందని విసుక్కుంటూ ఉంటే... ‘లైఫ్ అంటే ఇదీ’ అని చేసి చూపిస్తున్నారీ పిల్లలు. స్వచ్ఛమైన మనసుతో చూస్తే... ప్రతి సందర్భమూ ఒక గొప్ప ఆలోచనకు పునాది అవుతుంది. మీకు మేమున్నాం... ‘మేము కూడా సైనికులమే’ అంటున్నారు ఢిల్లీ నగర వాసులు. నగరంలో కోవిడ్ – 19 కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దానితో ఢిల్లీ అధికార యంత్రాంగం అహర్నిశలు పరుగులు పెడుతూ పనులు చేస్తోంది. ఈ మహమ్మారి మన వారియర్స్ అయిన పోలీసులను, నర్సులను కూడా విడిచిపెట్టటం లేదు. ఉద్యోగ విధుల్లో భాగంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వీరు కూడా ఆ వ్యాధికి గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ’ కొత్తగా ‘హమ్ భీ వారియర్స్’ అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఈ గ్రూపులోని సభ్యులంతా తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన పోలీసు బారికేడ్లను శానిటైజ్ చేస్తున్నారు. బారికేడ్ల దగ్గర పనిచేస్తున్న పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్ ఉచితంగా అందచేస్తున్నారు. ఈ సేవ వెనుక ఒక బలమైన కారణమే ఉంది. ఇక్కడ పనిచేసే పోలీసులంతా విధుల్లో భాగంగా ఎంతోమందితో మాట్లాడవలసి వస్తుంది. ఆ కారణంగా వారు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు, వారి ద్వారా ఇతరులకు ఈ వ్యాధి సోకుండా కూడా చూసుకోవాలి. ఆ బాధ్యతను ఈ సంస్థ సభ్యులు చేపట్టారు. ఈ సభ్యులు.. అవసరంలో ఉన్నవారికి ఆహారం కూడా అందచేస్తున్నారు. వీరు రెండు టీమ్‌లుగా ఏర్పడి, పోలీసులకు సేవలు అందిస్తున్నారు. షాహ్దరా ప్రాంతంలోని బారికేడ్లన్నిటినీ ఇప్పటికే శానిటైజ్ చేసేశారు. రానున్న రోజుల్లో శాస్త్రి పార్క్, లోనీ, భజన్‌పూర్ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందించే ఆలోచనలో ఉన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని, మరిన్ని ప్రాంతాల వారు ఇదే తరహా సేవలు చేయడానికి సన్నద్ధులవుతున్నారు. ‘‘ఇటువంటి విపత్కర సమయంలో పోలీసులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగానే వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే మేమందరం పోలీసుల దగ్గర ఉన్న బ్యారికేడ్లను శానిటైజేషన్ చేయటాన్ని ఒక ఉద్యమంలా ప్రారంభించాం’’ అంటున్నారు యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ’ జనరల్ సెక్రటరీ సౌరవ్ గాంధీ. -
ఏ సీమల ఏమైతివో
గెలవలేక పోయినప్పుడు భూమి మీద మనమొక్కరిమే ఏకాకిలా మిగిలి పోయినట్లు అనిపిస్తుంది.. సృష్టి ప్రారంభపు ఏకకణ జీవిలా! చేజారిన గెలుపుతో పాటే అన్నీ మనల్ని వదిలేసి పోయినట్లూ ఉంటుంది. చూసుకోం గానీ, ఒకరు మాత్రం ఆ క్షణంలో మన చెయ్యి పట్టుకునే ఉంటారు. ఓటమి! మరి ఒంటరివాళ్లం ఎలా అవుతాం? ఎగరేస్తున్న గాలిపటం తెగిపోతే హటాత్తుగా ఏకాకులై పోతారు చిన్నపిల్లలు. ఇంట్లో వదిలేసి అమ్మ ఊరెళ్లిపోయినా కూడా.. ‘ఏ సీమల ఏమైతివో.. ఏకాకినీ నా ప్రియా..’ అని కృష్ణశాస్త్రిలా విలపిస్తారు. ఆయన్ది కవిత్వం. వీళ్లవి కన్నీళ్లు. అంతే తేడా. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక చిన్నమ్మాయ్ షఫాలీ వర్మ దుఃఖానికి అంతేలేకుండా పోయింది. చిన్నమ్మాయే. ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఆడిన అతి చిన్నవయసు అమ్మాయి. పుట్టిన పదహారేళ్ల నలభై రోజులకే పోటీలోకి వచ్చేసింది. ‘షఫాలీని కన్నీళ్లతో చూడలేకపోతున్నా’ అన్నాడు బ్రెట్ లీ. తనకొస్తున్న కన్నీళ్లతో షఫాలీని చూడలేకపోయాడా, కన్నీళ్లతో ఉన్న షఫాలీని చూడలేకపోయాడా! షఫాలీ తనొక్కటే ఏడ్వడం కాదు. క్రీడాదిగ్గజాలకు, ఉద్ధండులకూ ఏడుపులాంటి ఫీలింగ్‌ని తెప్పించింది. ఒకప్పటి ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ. క్యాచ్ మిస్ అయితే ఎలా ఉంటుందో అతడికి తెలియని బాధ కాదు. క్యాచ్ మిస్ అయిందన్నది టీమ్ పడే బాధ అయితే.. ‘క్యాచ్‌ని మిస్ చేశానే’ అన్నది ఆ క్యాచ్ పట్టలేకపోయిన వారి బాధ. ఫైనల్స్‌లో కీలకమైన అలీసా హీలీ క్యాచ్‌ని మిస్ చేసింది షఫాలీ. అప్పట్నుంచే ఏకాకి అయిపోయింది. తను జారవిడిచింది క్యాచ్‌ని కాదు, కప్పుని. ఆటకు కనికరం ఉండదు. బ్రెట్లీలా ‘ఓ మై షఫాలీ’ అని సానుభూతి పడదు. కన్నీళ్లు పెట్టుకుంటే వెంటనే పెద్ద వర్షాన్ని కురిపించి, ఆ వర్షం నీళ్లలో కన్నీళ్లను కనబడనీయకుండా చేయదు. తన పనిలో తను ఉంటుంది. వెంటనే గెలిచినవాళ్ల దగ్గరకు వెళ్లిపోయి మెరుస్తున్న కప్పులో తన ముఖం చూసుకుని జుట్టు సవరించుకుంటుంది.. తన జట్టేదో గెలిచినట్లు, తనే గెలిపించినట్లు! అలాంటిది.. ఓడిపోయిన జట్టులోని షఫాలీ కన్నీళ్లను ఎందుకు పట్టించుకుంటుంది? ‘చిన్న పిల్లవు కదా, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అంటూ ముంగురుల్ని వేళ్లతో అలా అలా అనేసి ఎందుకు వెళుతుంది? ఆశలు పెట్టుకుంది షఫాలీ.. అందుకొచ్చిన ఏడుపు అది. ‘ఆశలు రాలి ధూళిపడినప్పుడు.. గుండెలు చీల్చు వేదనావేశము బ్రేల్చినప్పుడు.. వివేకము గోల్పడి సల్పినట్టి ఆక్రోశపు రక్త బిందువులతో..’ మేఘసందేశాన్ని రచియించాడు కృష్ణశాస్త్రి. ఈ అమ్మాయి కళ్లు మేఘాలై, ఓటమి వేదనను వర్షించాయి. అనుకుంటాం.. మన ఒంట్లో ఊపిరనేది ఒకటి ఉంటుందని, అందుకని జీవించి ఉంటాం అని. ఊపిరి కాదు ఉండేది. ఆశ. ఆశే ఊపిరికైనా ఆయువు. ఫైనల్స్‌లో తొలి ఓవర్లోనే రెండు పరుగులకే షఫాలీ ఔట్ అయింది! ఆయువు అవిరై కళ్లల్లోకి ఉబికి వచ్చేసింది. పిచ్, టీమ్, మెల్బోర్న్ మైదానం.. ఏవీ కనిపించడం లేదు. అంతా అలికేసినట్లున్న ఒకటే బ్లర్ పిక్చర్. ఓటమి! షఫాలీ మీద హోప్స్ పెట్టుకుంది భారత జట్టు. షఫాలీ ఉందని హోప్స్ వదులుకుంది ఆస్ట్రేలియా జట్టు. కప్పు కోసం పోటీ పడుతున్న రెండు జట్లకూ షెఫాలీ ముఖ్యం. షఫాలీని నిలబెట్టుకోవడం కోసం టీమ్ ఇండియా, షఫాలీని పడగొట్టడం కోసం టీమ్ ఆస్ట్రేలియా. గెలిస్తే ప్రపంచ కప్పులో భారత మహిళల తొలి విజయం. భారత్‌ను ఓడిస్తే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియాకు ఐదవ విజయం. అసలు ఫైనల్స్‌కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు టార్గెట్ అయింది షెఫాలీ. ‘ఐ జస్ట్ హేట్ ప్లేయింగ్ ఇండియా.. దే హ్యావ్ గాట్ ద ఉడ్ ఓవర్ మి’ అని అంది మెగాన్ షూట్. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ తను. ‘గాడ్ ద ఉడ్’ అనే మాట పూర్తిగా ఆస్ట్రేలియా వాళ్లది. ‘ఎక్కడం’ అని అర్థం. ట్రై సీరీస్‌లో షఫాలీ తన సిక్సర్‌తో ఆమెను ఎక్కేసిందట. అది గుర్తుంచుకుంది షూట్. బలమైనవాళ్లు కూడా గుర్తుపెట్టుకునేంత షాట్ కొట్టిందన్నమాట షఫాలీ! క్రీడాకారులలో, చిన్నపిల్లల్లో ప్రతీకారేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. పైగా షఫాలీ క్రీడాకారిణి అయిన చిన్నపిల్ల. ఫైనల్స్‌లో మళ్లీ సిక్సర్లు కొట్టి షూట్ నోటిని ‘ఆ..’ అని తెరిపించాలని కూడా ఆమె అనుకుని ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తన జట్టును గెలిపించాలని తపించి ఉండొచ్చు. అది సాధ్యం కాలేదు. తొమ్మిదేళ్ల వయసులో.. అబ్బాయిలు మాత్రమే ఆడే అకాడమీలో తనను చేర్పించడానికి అబ్బాయిలా తనకు క్రాఫ్ చేయించి సీటు సంపాదించిన తండ్రికి.. హర్యానా నుంచి ఆస్ట్రేలియా వచ్చే ముందు.. ‘నాన్నా.. కప్పుతో కనిపిస్తాం, చూస్తుండు’ అని షఫాలీ చెప్పే ఉండొచ్చు. అదీ సాధ్యం కాలేదు. సాధ్యం కాలేదూ అంటే ప్రయత్నలోపం కాదని తెలుసుకోడానికి షెఫాలీ మరికొన్ని ఆటలు ఆడాలి. దక్కని గెలుపు మిగిల్చి వెళ్లిన ఒంటరితనాన్ని పోగొట్టి అక్కున చేర్చుకునే మైదానాలు, వాటిలో ఆడవలసిన ఆటలు ఇంకా ఎన్నిలేవు ఈ చిన్నమ్మాయ్కి. -
తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కూతురు జాన్వీతో మధుర క్షణాలు
సాక్షి, సినిమా : తన కూతుళ్లు తన స్థాయికి ఎదిగేలా చేయాలని శ్రీదేవి పడ్డ తపన అంతా ఇంతా కాదు. పెద్ద కూతురు జాన్వీ కోసం పక్కా కెరీర్‌ను ఫ్లాన్ చేసిన ఆమె.. అరంగ్రేటం చూడకుండానే నిష్క్రమించారు. ఇద్దరు కూతుళ్లలో జాన్వీతోనే తనకు సాన్నిహిత్యం ఉండేదని.. చిన్నకూతురు ఖుషీ మాత్రం నాన్న కూచి అని పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు కూడా. ఈ క్రమంలో శ్రీదేవి-జాన్వీ మధ్య మధుర క్షణాలు ఎలా ఉన్నాయో చూడండంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. జాన్వీ బైక్ రైడ్ చేయగా.. వెనకాల శ్రీదేవి కూర్చున్నారు. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘అన్ని రోజులు మనవి కావు’ శ్రీదేవి చివరిసారిగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. జాన్వీతో అప్పుడే మీతో కొందరు పోల్చేయటం ఎంత వరకు సమంజసం అని విలేఖరి ప్రశ్నించగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. ‘జాన్వీ సినిమాల్లో నటిస్తా అని చెప్పినప్పుడు అంతా సంతోషించాం. నటించాలని తపన తనలో చాలా ఉంది. ఆ నిర్ణయాన్ని మేమూ సమర్థించాం. కానీ, నాతో పోల్చి చూస్తారనే భయం కలిగింది. అప్పుడే జాన్వీతో నేను చెప్పాం. నేను సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చా. ఈ స్థాయికి ఎదగటానికి నాకు మూడు దశాబ్దాలు పట్టింది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు నా తల్లి కూడా భయపడింది. కానీ, అనుక్షణం నా వెంటనే ఉండి.. నా ఎదుగుదలకు తోడ్పడింది. ఇప్పుడు నేనూ అంతే. కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకోకూడదు. అన్ని రోజులు మనవి కావు. సొంత టాలెంట్‌తోనే నువ్వు రాణించాల్సి ఉంటుంది. కోట్లాది కళ్లు నీపై ఉంటాయి. అంచనాలు అందుకోవటంలో విఫలమైతే ఇక నీ పని అంతే’ అని జాన్వీని హెచ్చరించినట్లు శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
బిడ్డ చివరి క్షణాలు సేవకోసం..!
జీవించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.. జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకోడానికి మనోనిబ్బరం కలిగి ఉండాలి. అదే విషయాన్ని నమ్మారు ఆ నూతన దంపతులు. తమకు పుట్టిన బిడ్డ కొన్ని గంటల్లోనే మరణిస్తాడని తెలిసినా కృశించిపోలేదు. తమ ఆవేదన మరెవ్వరికీ కలగకుండా ఉండాలంటే తాము నిరాశ చెందకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ బిడ్డతో చివరి క్షణాల్లో గడిపిన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు. ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో సేవలు పెంచేందుకు కావలసిన విరాళాల సేకరణ కోసం ఆ వీడియోను వినియోగించారు. సిడ్నీకి చెందిన దంపతులు నాన్సీ, ఛార్లీ మెక్లీన్ తమకు బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషించారు. కానీ.. ఆ తర్వాత అతడు అత్యంత అరుదైన నాన్ కెటోటిక్ హైపర్ గ్లైసినేమియాతో జన్మించాడని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శరీరం అమెనో యాసిడ్లను తయారుచేయడాన్ని నిరోధించే ఈ పరిస్థితి దాపురించడంతో ఎడిసన్ ఊపిరి తీసుకునేందుకు కూడా వెంటిలేటర్ పైనే ఆధారపడాల్సిన స్థితికి చేరుకున్నాడు. అయితే ఎవ్వరూ తమ బిడ్డ చనిపోవాలని కోరుకోరు. కానీ అతడి స్థితిని తెలుసుకున్న తల్లిదండ్రులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటిలేటర్ తీస్తే బిడ్డ చనిపోతాడని తెలిసినా ఎడిసన్ పుట్టిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు చార్లీ, మెక్లీన్ వెంటిలేటర్ పై ఊపిరి అందించడాన్ని నిలిపివేశారు. ఏం చేసినా చనిపోతాడని తెలిసిన తర్వాత.. సొంత ఊపిరితో ఎంతకాలం బతుకుతాడో అంతే బతకనిచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ తమ బిడ్డ జన్మ మరెందరికో సహాయపడాలని నిర్థారించుకున్న ఆజంట.. గత సంవత్సరంలో తమ పెళ్లిఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ ను పిలిపించారు. ఎడిసన్ చివరి క్షణాల్లో తమతో గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు. అవే చిత్రాలను స్థానిక మిడ్‌వైవ్స్ అండ్ నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ సర్వీస్ లో మరిన్ని సేవలను పెంచేందుకు విరాళాల కోసం వినియోగించారు. క్రౌడ్ ఫండింగ్ పేరున ఓ పేజీని ఎడిసన్ జ్ఞాపకార్థం ప్రారంభించిన ఛార్లీ, మెక్లీన్.. తమ బిడ్డ తమకు మంచి పాఠం నేర్పించాడంటూ పేజీలో రాసుకున్నారు. ''మీరు ప్రేమించేవారిని ఆనందంగా ఉంచేందుకు ప్రతిక్షణం వినియోగించండి, ప్రతిక్షణాన్ని చివరి క్షణంగా భావించి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి... మనకోసం ఏ క్షణం ఆగదు, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆనందంగా ఉండేందుకు, ఇతరులను సంతోషంగా ఉంచేందుకు వినియోగించండి'' అంటూ సూచించారు. తమ బిడ్డతో సంబంధం ఏడు రోజులే అయినా ఏడుజన్మల బంధంగా భావించామని, ఆ సమయాన్ని ప్రేమ కోసమే వినియోగించామని అన్నారు. తమ ముద్దుల బిడ్డ జ్ఞాపకార్థం 20 వేల డాలర్ల వరకూ ఫండ్స్ సేకరించి రాయల్ ఉమెన్స్ హాస్పిటల్ మిడ్ వైవ్స్, నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కు అందించాలన్న ఆశయంతోనే ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6700 డాలర్ల వరకూ సేకరించినట్లు వివరించారు. -
విస్మయపరుస్తున్న గడాఫీ చివరి క్షణాల వీడియో
సుమారు ఐదు సంవత్సరాల తర్వాత అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసే వీడియో వెలుగులోకి వచ్చింది. అతి పెద్ద నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫి.. నెత్తురోడుతూ దిక్కులేని పరిస్థితిలో కనిపించాడు. ఆయన చివరిక్షణాలు ఎలా ముగిశాయన్న వివరాలను తాజా ఫుటేజీ చెప్తోంది. దెబ్బలతో రక్తంకారుతున్న శరీరం, తలకు పాయింట్ చేసిన గన్...అతి దీనమైన స్థితిలో ఉన్నగడాఫీ వీడియోను లిబియన్ రెబల్స్ మొబైల్ ఫోన్లో తీసినట్లు తెలుస్తోంది. లిబియా తిరుగుబాటుదారులు ఆ వీడియో కల్నల్ గడాఫీ హత్యకు కొద్ది క్షణాల ముందే చిత్రించారు. రెబల్ ఫైటర్ అయ్ మాన్ అల్మాని అక్టోబర్ 2011 లో తీసుకున్న వీడియో ఫుటేజ్ ను తాజాగా బయట పెట్టాడు. గడాఫీ చనిపోయేందుకు ముందు అతడిచుట్టూ సాయుధ తిరుగుబాటుదారులు నిలబడి ఉన్నట్లు వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. తలకు, ఒంటికి గాయాలై... రక్తస్రావంతో ఉన్న గడాఫీ తనను ప్రాణాలతో వదిలేయమని అభ్యర్థిస్తున్నట్లు కూడ వీడియో ఫుటేజ్ లో వినిపిస్తోంది. కొన్ని క్షణాల తర్వాత తిరుగుబాటుదారుడు గడాఫి తలపై అతడి గోల్డెన్ గన్ పెట్టి కాల్చి చంపినట్లు వీడియో వివరిస్తోంది. అయితే ఆ నియంతకు తగిన శిక్షే పడిందని తాజాగా వీడియో ఫుటేజ్ బయటపెట్టిన అల్మానీ చెప్తున్నాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తనవద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని అంటున్నాడు. గడాఫీ హత్య తర్వాత విస్తృతంగా బయటికొచ్చిన చిత్రాలు హత్యకు అల్మానీయే కారణమని చెప్తున్నా... నిజానికి తాను గన్ పేల్చలేదని, తర్వాత నేలపై పడి ఉన్న ఆ బంగారు తుపాకీనీ తన చేతిలోకి తీసుకున్నానని చెప్తున్నాడు. అప్పట్నుంచీ గడాఫీ విధేయులు తనను చంపేస్తామని బెదిరిస్తూనే ఉన్నారని అంటున్నాడు. ఇపుడు తాను బయట పెట్టిన కొత్త ఫుటేజ్... గడాఫీ హత్యలో తనకన్నా ఇతరులదే అధిక పాత్ర ఉన్నట్లు రుజువు చేస్తుందని అల్మానీ భావిస్తున్నాడు. -
మరణించినా.. హీరోగా మారాడు!
ఒకవైపు మృత్యువు దూసుకొస్తోంది. ఆ విషయం విమానంలో ఉన్నవాళ్లెవరికీ తెలియదు.. పైలట్‌కు మాత్రం తెలుసు. అయినా ఎలాగోలా ఇతరుల ప్రాణాలు కాపాడాలని చివరి క్షణం వరకు ప్రయత్నించాడు. దగ్గర్లోనే ఆయిల్ ట్యాంకర్, రైల్వే ట్రాక్ ఉన్నా.. విమానం వాటి మీదకు పడకుండా దూరంగా చెట్ల మీద పడేలా చూశాడు. బీఎస్ఎఫ్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ పైలట్.. హీరోగా నిలిచాడు. సూపర్ కింగ్ బి200 విమాన ప్రమాదంలో 10 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది మరణించిన ఘటనలో పైలట్.. నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషిచేశాడు. టేకాఫ్ తర్వాత కొన్ని సెకన్లకే విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడాన్ని గుర్తించిన అతడు.. విమానాశ్రయం సరిహద్దు గోడ దగ్గర ఉన్న చెట్టుపై పడేలా చేసి భారీ నష్టాన్ని తగ్గించాడు. ఉదయం బయలుదేరిన క్షణంలోనే పైలట్ కెప్టెన్ భగవతి ప్రసాద్ ఇంజన్లో సమస్య ఉందని గ్రహించాడు. ఇంతలోనే కూలిపోతున్న పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించి భారీ నష్టాన్ని నియంత్రించగలిగాడు. కానీ కేవలం 60 సెకన్లలోనే పైలట్ ప్రసాద్, కో పైలట్ రాజ్ దేశ్ సహా పదిమంది బీఎస్ఎఫ్ సిబ్బంది జీవితాలు ఆహుతైపోయాయి. ప్రమాదం జరుగుతోందని తెలిసినా సిబ్బందిని రక్షించే సమయం లేకపోయింది. ఇంజన్లో సాంకేతిక లోపం రావడంతో నేలపై పడబోయిన విమానాన్ని 180 డిగ్రీల్లో యు టర్న్ తీసుకొన్నాడు. భారీనష్టం వాటిల్లకుండా చూసేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించి, విమానాన్ని బలవంతంగా చెట్టుకు గుద్దించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విమానంలో సాంకేతిక లోపం వచ్చిందని గమనించగానే పైలట్ ఏటీసీ అనుమతితో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడని కొందరు అధికారులు, ఇతర ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఢిల్లీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.