జాన్వీతో శ్రీదేవి (పాత చిత్రం)
సాక్షి, సినిమా : తన కూతుళ్లు తన స్థాయికి ఎదిగేలా చేయాలని శ్రీదేవి పడ్డ తపన అంతా ఇంతా కాదు. పెద్ద కూతురు జాన్వీ కోసం పక్కా కెరీర్‌ను ఫ్లాన్ చేసిన ఆమె.. అరంగ్రేటం చూడకుండానే నిష్క్రమించారు.
ఇద్దరు కూతుళ్లలో జాన్వీతోనే తనకు సాన్నిహిత్యం ఉండేదని.. చిన్నకూతురు ఖుషీ మాత్రం నాన్న కూచి అని పలు ఇంటర్వ్యూల్లో ఆమె చెప్పారు కూడా. ఈ క్రమంలో శ్రీదేవి-జాన్వీ మధ్య మధుర క్షణాలు ఎలా ఉన్నాయో చూడండంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.
జాన్వీ బైక్ రైడ్ చేయగా.. వెనకాల శ్రీదేవి కూర్చున్నారు. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేకపోయినప్పటికీ... ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘అన్ని రోజులు మనవి కావు’
శ్రీదేవి చివరిసారిగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీని ఉద్దేశించి చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. జాన్వీతో అప్పుడే మీతో కొందరు పోల్చేయటం ఎంత వరకు సమంజసం అని విలేఖరి ప్రశ్నించగా.. దానికి ఆమె సమాధానం ఇచ్చారు. ‘జాన్వీ సినిమాల్లో నటిస్తా అని చెప్పినప్పుడు అంతా సంతోషించాం. నటించాలని తపన తనలో చాలా ఉంది. ఆ నిర్ణయాన్ని మేమూ సమర్థించాం. కానీ, నాతో పోల్చి చూస్తారనే భయం కలిగింది. అప్పుడే జాన్వీతో నేను చెప్పాం. నేను సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చా. ఈ స్థాయికి ఎదగటానికి నాకు మూడు దశాబ్దాలు పట్టింది. నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నప్పుడు నా తల్లి కూడా భయపడింది. కానీ, అనుక్షణం నా వెంటనే ఉండి.. నా ఎదుగుదలకు తోడ్పడింది. ఇప్పుడు నేనూ అంతే. కానీ, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకోకూడదు. అన్ని రోజులు మనవి కావు. సొంత టాలెంట్‌తోనే నువ్వు రాణించాల్సి ఉంటుంది. కోట్లాది కళ్లు నీపై ఉంటాయి. అంచనాలు అందుకోవటంలో విఫలమైతే ఇక నీ పని అంతే’ అని జాన్వీని హెచ్చరించినట్లు శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment