ఖమ్మం (భద్రాచలం అర్బన్) : వివాహం జరిపించాలన్నా.. నూతన గృహప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా.. శుభ ముహూర్తం కోసం వెతికి మరీ అదే రోజు, అదే సమయానికి సంప్రదాయంగా ప్రారంభించి మొదలుపెడతాం. ముఖ్యంగా వివాహాలకు అయితే కచ్చితంగా పాటించాల్సిందే. కోవిడ్ తర్వాత రెండేళ్లకు పెళ్లి మంత్రాలు మోగుతున్నాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు తమ పిల్లల వివాహాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఈ ఏడాది సుముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఉరుకులు, పరుగులతో పెళ్లిళ్లు కానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు మాత్రమే సుముహూర్తాలు ఉండడంతో అందరూ బిజీబిజీగా గడిపారు.
కరోనాతో మోగని పెళ్లి బాజా..
రెండేళ్ల కరోనా కాలంలో చాలా మంది పెళ్లి మాట ఎత్తనేలేదు. కొంతమంది పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనల కారణంగా వాయిదా వేశారు. కానీ, ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో కొత్త సంవత్సరం మొదలు జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగాయి. జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన ముహూర్తాలకు ఆగస్టులో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఆగడం ఎందుకని పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాల వారు తొందరపడుతూ పెళ్లిళ్లు చేస్తున్నారు.
కోలుకుంటున్న వ్యాపారాలు ..
కోవిడ్ కారణంగా వరుసగా రెండేళ్లు దెబ్బతిన్న వ్యాపారాలు ఈ ఏడాది జరిగిన వివాహాలతో కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వివాహాలు వేల సంఖ్యలో జరగడంతో శుభలేఖలు, దుస్తులు, ఫొటోలు, వీడియో, ట్రావెల్స్, పెళ్లి మండపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్ మేళాలు, కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు పెరగడంతో అన్నిరకాల షాపులు కళకళలాడుతున్నాయి.
మిగిలిన ముహూర్తాలు ఇవే..
జనవరి నుంచి జూన్ వరకు వేలాది పెళ్లిళ్లు జరిగినా.. జూలై ఆషాఢ మాసంతో మాత్రం బ్రేక్ పడింది. ఆగస్టు శ్రావణ మాసంలో 3, 4, 5, 6, 10, 11, 13, 17, 20, 21 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్లో బాద్రపద మాసం, శుక్ర మౌఢ్యమి ప్రారంభంలో, అక్టోబర్, నవంబర్‌లో శుక్ర మౌఢ్యమితో మంచి రోజులు లేవు. మళ్లీ డిసెంబర్‌లో 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.
మూడు నెలలు ఆగాల్సిందే..
ఆషాఢ మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో కేవలం 10 రోజులు మాత్రమే ము హూర్తాలు ఉండగా.. మళ్లీ డిసెంబర్‌లో మా త్రమే మంచి రోజులు ఉన్నాయి. దీనికోసం మూడునెలలు ఆగాలి్సందే. ఆపై ఉగాది వరకు కూడా ముహూర్తాలు లేనందున వీలైనంత తొందరగా తమ పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు.
– విశ్వనాథ్‌శర్మ, అర్చకులు, భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment