Karthikeya Got Engaged: ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది. కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీంతో పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె కార్తికేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తుంది. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు.
కాగా కార్తికేయ సినిమాల సంగతి చూస్తే… ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చి మెప్పించాడు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ‘రాజా విక్రమార్క’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.
చదవండి : వైరల్ : చిరంజీవి ఇంట్లో గ్రాండ్‌గా రాఖీ సెలబ్రేషన్స్
Rakul: ఓబులమ్మగా రకుల్ ప్రీత్‌సింగ్..ఫస్ట్‌లుక్ రిలీజ్
Comments
Please login to add a commentAdd a comment