Brutal Trolls On Mohammed Shami Wife Bold Photo Goes Viral - Sakshi
Sakshi News home page

Mohammed Shami Wife Hasin Jahan: బోల్డ్‌ ఫోటో షేర్‌ చేసిన షమీ భార్య.. ట్రోలింగ్‌

Published Thu, Aug 19 2021 3:19 PM | Last Updated on Thu, Aug 19 2021 4:36 PM

Indian Pacer Mohammed Shami Wife Shares BOLD Photo Gets Brutally Trolled - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా హసీన్‌ జహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. ఇది చూసిన వారు కొందరు అందంగా ఉన్నావని పొగడగా.. చాలామంది మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్‌ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో హసీన్‌ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. దీనిలో హసీన్‌ తెలుపు రంగు రగ్గడ్‌ జీన్స్‌, బ్లాక్‌ టాప్‌ ధరించి ఉన్నారు. ఈ క్లోజప్‌ ఫోటోలో హసీన్‌ కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్‌ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్‌.. అయినా కూడా ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటూ మండిపడుతున్నారు.

ఇక షమీ-హసీన్‌ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. కొన్నేళ్ల క్రితం హసీన్‌ షమీపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తకు వేరే మహిళతో సంబంధ ఉందని ఆరోపించారు. కానీ వాటిని నిరూపించలేకపోయారు. కోల్‌కతాకు చెందిన హసీన్‌ జహాన్‌, షమీ 2014, ఏప్రిల్‌ 7 న వివాహం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement