ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంఇ... ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం రానురానూ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పుడిప్పుడే హింసాకాండ నుంచి రాష్ట్రం కోలుకుంటుండగా మళ్లీ అల్లర్లు తలెత్తాయి. తాజాగా మణిపూర్‌లో మరో అఘాయిత్యం వెలుగుచూసింది.
మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూలైలో కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక తప్పిపోయిన విద్యార్థులు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్టింట్లో సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నెటిజన్లు.. ఈ కేసును చేధించడానికి పోలీసులకు ఇంత సమయం ఎందుకు పట్టిందంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు 17 ఏళ్ల హిజామ్ లిన్‌తోఇంగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్ జూలై నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తాజాగా వారు అడవిలోని గడ్డి మైదానంలో కూర్చుని, వారి వెనకాల కొంచెం దూరంలో సాయుధ గ్రూప్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది.
చదవండి: నేడు కవిత ఈడీ సమన్ల పిటిషన్ విచారణ
ఇందులో లింతోంగంబి తెల్లటి టీ-షర్ట్‌లో ఉండగా, మిస్టర్ హేమ్‌జిత్, బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని, చెక్డ్ షర్ట్‌లో ఉన్నారు. వారి వెనుక ఇద్దరు సాయుధ వ్యక్తులు తుపాకీలతో స్పష్టంగా కనిపిస్తున్నారు. మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్లు కనిపిస్తుంది. జూలైలో ఓ షాపుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఇద్దరు విద్యార్థులు కనిపించినా వారి జాడ తెలియలేదు.
ఈ ఫోటోలు వైరల్‌గా మారాడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. జూలై నుంచి తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు సోషల్ మీడియాలో రావడం తమ దృష్టికి వచ్చినట్లు మణిపూర్ ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారిస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఎలా అదృశ్య మయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? వారిని హత్య చేసిన నేరస్థులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
హేమ్‌జిత్, లింతోయింగంబి కిడ్నాప్, హత్యకు కారకులైన వారిపై వేగవంతమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, విచారణాధికారులు తమ పని తాము చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులు అధునాతన సైబర్ ఫోరెన్సిక్స్ సాధనాలను ఉపయోగించనున్నారని వీటి ద్వారా ఫోటోలు మరింత స్పష్టంగా చేసి అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు తోడ్పడనున్నట్లు తెలిపింది.
చదవండి: గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
Indian Media has been mediocre at straightforward stories. Bharka got an A+ on her coverage on Covid. Karan did many insightful coverages in the past.
— Skeeper (@Skeeper10) September 25, 2023
How did all of them fail so spectacularly on multi-layered stories in Manipur where they bit hook, line and sinker on what they… pic.twitter.com/7UF1ljvO3o
Comments
Please login to add a commentAdd a comment