
ఆరు పదుల వయసులోనూ నవ మన్మథుడిగానే కనిపిస్తూ ఉంటాడు అక్కినేని నాగార్జున. గ్లామర్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలిస్తుంటాడు. ఆయన ఎంచుకునే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. కుర్ర హీరోలు కూడా అంత ఎనర్జిటిగ్‌గా నటించరేమో అన్నట్లుగా నాగ్ యాక్టింగ్ ఉంటుంది. ఆయన ఎనర్జీ, అందం రహస్యం ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే మిలిగిపోయింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు నాగార్జున పూర్తిగా మారిపోయాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోనే ఇందుకు నిదర్శనం. అందులో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపించడం అందరిని షాక్కు గురిచేస్తుంది. మేకప్ లేకుండా కింగ్ ఇలా ఉంటారా ? అనే సందేహం వ్యక్తమవుతుంది.
ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండా.. రా ఏజెంట్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. అలాగే బంగార్రాజు అనే చిత్రంలోనూ నటించబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment