
Virat Kohli Shares Adorable Photo With Anushka Sharma.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన భార్య అనుష్క శర్మతో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఆదివారం కావడంతో విరుష్క జోడి ఒక ఫోటోను కూయాప్‌లో పంచుకున్నారు. మార్నింగ్ వైబ్స్ పేరుతో.. ఇద్దరు సేమ్ టీషర్ట్ వేసుకొని ఫోటోకు ఫోజిస్తూ.. ''మై రాక్..'' అంటూ హార్ట్ ఎమోజీని ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జత చేశారు.
కాగా షేర్ చేసిన 45 నిమిషాల్లోనే 600 మంది లైక్ చేయడం విశేషం. ఇక అంతకముందు ఏబీ డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్స్ నుంచి తప్పుకోవడంతో కోహ్లి స్పందించిన విషయం తెలిసిందే. ఐ లవ్ యూ ఏబీ.. నా గుండె ముక్కలయ్యింది'' అంటూ పోస్ట్ షేర్ చేశాడు. కివీస్‌తో టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చదవండి: Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు
IND vs NZ: హోటల్ రూంకు టీమిండియా ఆటగాళ్లు.. ద్రవిడ్ మాత్రం
Comments
Please login to add a commentAdd a comment