టీమిండియా స్టార్.. 'కింగ్' కోహ్లి స్వదేశంలో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోహ్లికి స్వదేశంలో 200వ మ్యాచ్. తొలి టెస్టులో ఆకట్టుకోని కోహ్లి రెండో టెస్టులో (తొలి ఇన్నింగ్స్ 44 పరుగులు, రెండో ఇన్నింగ్స్ 20 పరుగులు) టచ్‌లో కనిపిస్తున్నాడు. అయితే కోహ్లి నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు వరుస సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లి తనకు ప్రతిష్టాత్మకంగా మారిన మ్యాచ్‌లో శతకంతో మెరుస్తాడా లేదా అనేది చూడాలి.
ఇప్పటివరకు కోహ్లి స్వదేశంలో అన్ని ఫార్మాట్లు కలిపి 199 మ్యాచ్‌లాడి 10,829 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 254 నాటౌట్‌గా ఉంది. 200వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా కోహ్లి ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్ ఇంటర్య్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన భార్య అనుష్క శర్మ తనకు ఆదర్శమని.. బలం, బలహీనత రెండు తనేనని పేర్కొన్నాడు. ఇంట్లో మొత్తం తనే బాధ్యత తీసుకుంటుంది. వామికా మా జీవితంలోకి వచ్చాకా అనుష్క మరింత బాధ్యతగా మారిందన్నాడు.
ఇక కోహ్లి టెస్టుల్లో సెంచరీ చేసి మూడేళ్లు కావొస్తుంది. 2020లో మూడు టెస్టులు కలిపి 116 పరుగులు, 2021లో 11 మ్యాచ్‌లు కలిపి 536 పరుగులు, నాలుగు అర్థసెంచరీలు, 2022లో ఆరు మ్యాచ్‌లు కలిపి 265 పరుగులు చేశాడు. కనీసం ఈ ఏడాదైనా కోహ్లి టెస్టు సెంచరీ కరువు తీర్చుకుంటాడేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment