Virat Kohli-Anushka Sharma spiritual break in Rishikesh Ashram - Sakshi
Sakshi News home page

Virat Kohli: మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక ధోరణిలోకి

Published Tue, Jan 31 2023 10:48 AM | Last Updated on Tue, Jan 31 2023 11:05 AM

Virat Kohli-Anushka Sharma Spiritual Break In Rishikesh Ashram Viral - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మ్యాచ్‌లు లేకుంటే ఆధ్యాత్మిక వాతావరణంలో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి రుషికేష్‌ టూర్‌కు వెళ్లాడు. విరుష్క దంపతులు రుషికేష్‌లోని స్వామి దయానంద్‌ గిరి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్వామిజీ దగ్గర దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

ఇటీవలే విరాట్‌-అనుష్కలు తరచు ఆశ్రమాలను సందర్శించడం ఆసక్తి సంతరించుకుంది. అంతకముందు కోహ్లి, అనుష్కలు తమ కూతురు వామికాతో కలిసి బాబా నీమ్ కరోలి బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి బాబా ఆశీర్వాదాలు పొందారు. అనంతరం అక్కడున్నవారికి దుప్పట్లు పంపిణీ చేశారు.

ఇక కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ భారత్‌కు చాలా కీలకం కానుంది. వన్డేల్లో మంచి ఫామ్‌ కనబరుస్తున్న కోహ్లి స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ముగిశాక వన్డే వరల్డ్‌కప్‌పై దృష్టి సారించనున్నాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ కోహ్లి కెరీర్‌లో చివరి వన్డే వరల్డ్‌కప్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

చదవండి: పృథ్వీ షా లవ్‌స్టోరీకి ఎండ్‌కార్డ్‌ పడిందా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement