సార్‌.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్‌ వెలిగించు | Kanpur Commissioner Shared Photo Of Tried Cooking Poha Trolled | Sakshi
Sakshi News home page

సార్‌.. ఫోజులు తర్వాత.. ముందు గ్యాస్‌ వెలిగించు

Published Mon, Dec 20 2021 6:52 PM | Last Updated on Mon, Dec 20 2021 6:53 PM

Kanpur Commissioner Shared Photo Of Tried Cooking Poha Trolled - Sakshi

ఫోటో షేర్‌ చేసి విమర్శలు ఎదుర్కొంటున్న కమిషనర్‌

లక్నో: సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. చాలా మంది సెలబ్రిటీ స్టేటస్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా శ్రమించిన వారు విన్‌ అవుతుంటే.. ఏం లేకపోయినా.. హడావుడి చేసే బాపతు బ్యాచ్‌ మాత్రం తుస్సుమంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. సార్‌ చాలా శ్రమ పడి ఫోజులిచ్చారు కానీ.. మీ ప్రయత్నం వృథా అయ్యింది అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఆ వివరాలు..

కాన్పూర్‌ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి రాజ్‌ శేఖర్‌ ఆదివారం వంటింట్లో గరిటె పట్టిన ఫోటోని ఒకదాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘నాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పండి.. వంటలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.. ఉదయం టిఫిన్‌ కోసం పోహా తయారు చేస్తున్నాను.. అది కూడా హోం మినిస్టర్‌ అధ్వర్యంలో’’ అనే క్యాప్షన్‌తో ఫోటోని షేర్‌ చేశారు.
(చదవండి: ఒమిక్రాన్‌ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్‌!)

ఇక దీనిలో రాజ్‌ శేఖర్‌.. నీటుగా సూటు బూటు వేసుకుని తయారయి ఉన్నారు. అన్నింటికంటే.. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. వంట చేస్తున్నానని చెప్పారు.. కానీ గ్యాస్‌ వెలిగించి లేదు. ఇది గమనించుకోకుండా.. ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కానీ నెటిజనులు ఎంత జాగ్రత్తగా గమనిస్తారో తెలుసు కదా.. దాంతో కమిషనర్‌ పరువు పొగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. 
(చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి)

ఈ ఫోటో చూసిన నెటిజనులు.. ‘‘సార్‌.. వంట బాగా చేశావ్‌.. స్టవ్‌ వెలిగిస్తే.. ఇంకా బాగుండేదేమో’’.. ‘‘సూటు బూటు వేసుకుని వంట చేస్తారా ఎవరైనా’’.. ‘‘గ్యాస్ ధర చుక్కలనంటుతుంది.. మీరేమో మంటతో పని లేకుండా వంట చేశారు.. ఆ టెక్నిక్‌ మాకు కూడా చెప్పండి’’.. ‘‘ఈ ఫోటోని గనక ఐక్యరాజ్యసమితి చూస్తే.. దెబ్బకు మూర్ఛపోతుంది.. మీ ఐడియాను తెగ ప్రశంసిస్తుంది.. గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా సగానికి సగం తగ్గుతుంది’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

చదవండి: మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement