
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఛాతీ నొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇస్తూ కశ్యప్ కూతరు అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలతో పాటు వీడియో షేర్ చేసింది. ఆయన పూర్తిగా కోలుకున్నారని, ఎప్పటి లాగే తమతో సరదాగా ఉంటున్నారంటూ ఆయన కూతురు తెలిపింది. అయితే ఈ ఫోటోల్లో అనురాగ్ గుండు చేయించుకుని, ఒత్తైన కను బొమ్మలు, గడ్డంతో దర్శనమిచ్చారు. ఆయనను అలా చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఏమైంది.. సార్ బాగానే ఉన్నారు కదా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్‌కు ఛాతిలో స్వల్పంగా నొప్పిరావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యలు ఆయనకు ఆంజియోప్లాస్టి సర్జరీ చేయాలని సూచించినట్లు కశ్యప్ టీం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆయన ప్రస్తుతం మెడికేషన్‌లు ఉన్నారని.. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో పూర్తిగా కోలుకున్న ఆయన తాజా ఫొటోలు, వీడియోను అలియా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. కాగా తాప్సీ పన్ను లీడ్ రోల్‌లో ఆయన దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘దోబారా’. మార్చిలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment