Fans troll Andre Russell after his nude photo goes viral on social media - Sakshi
Sakshi News home page

Andre Russell: 'నీకేం పోయే కాలం'.. రసెల్‌పై అభిమానుల ఆగ్రహం

Published Sat, Nov 19 2022 11:48 AM | Last Updated on Sat, Nov 19 2022 12:33 PM

Fans Troll Andre Russell Nude Photo Shared Social Media Goes Viral  - Sakshi

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో దిగిన రసెల్‌ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం ఆగ్రహాం తెప్పించింది. ప్రైవేట్‌ లీగ్స్‌ మోజులో పడి దేశానికి ఆడడం మానేసిన రసెల్‌పై.. ''నీకేం పోయే కాలం.. ఈ సోకులకేం తక్కువ లేదు.. ఇలాంటి వాటిలో కాదు ఆటలో చూపించు నీ ప్రతాపం'' అంటూ మండిపడ్డారు. 

కాగా భారత అభిమానులు మాత్రం రసెల్‌ను దారుణంగా ట్రోల్‌ చేశారు. రసెల్‌ దిగిన న్యూడ్‌ ఫోటోనూ చాలామంది రణ్‌వీర్‌ సింగ్‌ ఫోటోతో పోలుస్తున్నారు కొన్ని నెలల క్రితం బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ ఒక మ్యాగ్‌జైన్‌ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోషూడ్‌ ఇచ్చాడు. అప్పట్లో రణ్‌వీర్‌ ఫోటోషూట్‌పై పెద్ద వివాదామే నడిచింది. తాజాగా రసెల్‌ను కూడా రణ్‌వీర్‌తో పోలుస్తూ కామెంట్స్‌ చేశారు.

ఇక రసెల్‌ విండీస్‌ తరపున ఆడి చాలా కాలమైపోయింది. విండీస్‌ క్రికెట్‌ బోర్డు సీఈవోతో గొడవ రసెల్‌ను జాతీయ జట్టుకు దూరం చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన రసెల్‌ మళ్లీ జాతీయ జట్టు గడప తొక్కలేదు. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ ఘోర ప్రదర్శన కనబరిచింది. కనీసం క్వాలిఫయర్‌ దశ కూడా దాటలేయపోయిన విండీస్‌ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక రసెల్‌ విండీస్‌ తరపున 56 వన్డేలు, 67 టి20మ్యాచ్‌లు ఆడాడు.

ఇక ఇటీవలే ఐపీఎల్‌లో కేకేఆర్‌ ఆండ్రీ రసెల్‌ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2023 మినీవేలంకు ముందు కేకేఆర్‌ 11 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్‌కతా పర్స్‌లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి.

కేకేఆర్‌ రిటైన్‌ లిస్ట్‌: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్

కేకేఆర్‌ రిలీజ్‌ లిస్ట్‌: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్

చదవండి: సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్‌ శర్మను ఎప్పుడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement