After Husband Chaitanya Niharika Konidela Deletes All Marriage Posts From Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika Konidela: మెగా డాటర్‌ విడాకులు నిజమేనా..! నిహారిక ఏంటీ ఇలా చేసింది..

Published Mon, Apr 10 2023 11:42 AM | Last Updated on Mon, Apr 10 2023 12:38 PM

After Husband Chaitanya Niharika Konidela Deletes All Marriage Posts From Instagram - Sakshi

మెగా డాటర్‌ నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద సమక్షంలో నిహారిక-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: హౌజ్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర

ఈ వార్తలకు నిహారిక భర్త చైతన్యే ఆజ్యం పోశాడు. పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో కలిసి షికార్లకు, వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తొలిగించాడు. దీంతో మెగా డాటర్‌ విడాకుల రూమర్స్‌ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ నిహారిక కూడా భర్త బాటలోనే నడిచింది. ఇప్పటి వరకు పెళ్లి ఫొటోలు డిలిట్‌ చేయని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తాజాగా ఆ ఫొటోలు మాయమయ్యాయి. భర్త చైతన్య లాగే నిహారిక కూడా పెళ్లికి సంబంధించిన పోస్ట్స్‌తో పాటు భర్తతో కలిసి వెళ్లిన వెకేషన్‌ పిక్స్‌ తొలగించింది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన పోస్ట్స్‌ కూడా డిలిట్ చేసింది. 

చదవండి: బేబీబంప్‌తో బిగ్‌బాస్‌ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్‌

దీంతో మరోసారి మెగా డాటర్‌ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరు విడిపోయారా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైవర్స్‌ రూమర్స్‌పై స్పందించని నిహారిక ఇలా తన విడాకులపై క్లారిటీ ఇచ్చిందా? అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరి విడాకులు వార్తలు నిజం కాకుండ ఉంటే బాగుండు అంట మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అంతేకాదు విడాకుల అబద్ధం అని చెప్పండి మేడం అంటూ నిహారికి పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇందులో నిహారిక తన తల్లి చీర కట్టుకుని పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటో మాత్రం డిలిట్‌ చేయకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement