Venkata Chaitanya
-
భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై క్లారిటీ ఇచ్చిందా?
మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద సమక్షంలో నిహారిక-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర ఈ వార్తలకు నిహారిక భర్త చైతన్యే ఆజ్యం పోశాడు. పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో కలిసి షికార్లకు, వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించాడు. దీంతో మెగా డాటర్ విడాకుల రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ నిహారిక కూడా భర్త బాటలోనే నడిచింది. ఇప్పటి వరకు పెళ్లి ఫొటోలు డిలిట్ చేయని ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తాజాగా ఆ ఫొటోలు మాయమయ్యాయి. భర్త చైతన్య లాగే నిహారిక కూడా పెళ్లికి సంబంధించిన పోస్ట్స్‌తో పాటు భర్తతో కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ తొలగించింది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన పోస్ట్స్ కూడా డిలిట్ చేసింది. చదవండి: బేబీబంప్‌తో బిగ్‌బాస్ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్ దీంతో మరోసారి మెగా డాటర్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరు విడిపోయారా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైవర్స్ రూమర్స్‌పై స్పందించని నిహారిక ఇలా తన విడాకులపై క్లారిటీ ఇచ్చిందా? అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరి విడాకులు వార్తలు నిజం కాకుండ ఉంటే బాగుండు అంట మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాదు విడాకుల అబద్ధం అని చెప్పండి మేడం అంటూ నిహారికి పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిహారిక తన తల్లి చీర కట్టుకుని పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటో మాత్రం డిలిట్ చేయకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మెగా పెళ్ళి సందడి
కొణిదెల వారింటి గారాలపట్టి, సినీ నటి నిహారిక వివాహం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు చూడచక్కని జంట అనిపించుకున్నారు. బంగారు వర్ణపు చీరలో నిహారిక మెరిసిపోయింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మిస్ యూ... నిహా తల్లీ... నటుడు నాగబాబు, తన కుమార్తె నిహారిక పెళ్లి వేడుకకు సంబంధించిన ఒక ఫొటోను షేర్ చేసి, ‘‘నా చిన్నారి స్కూల్‌కి వెళ్లే వయసులో అడుగుపెట్టినప్పుడు ఇక తనతో రోజంతా ఆడుకోలేమనే ఫీలింగ్ వెంటాడేది. ఆ ఫీలింగ్‌ను దూరం చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నా కూతురు తొలిరోజు పాఠశాలకు (పెళ్లిని ఉద్దేశించి) వెళుతున్నట్లుగా ఉంది. అయితే తను సాయంత్రం తిరిగి రాదు. ఇప్పుడు ఈ ఫీలింగ్‌ను పోగొట్టుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి. కాలమే నిర్ణయిస్తుంది. ఆల్రెడీ నిన్ను మిస్సవుతున్నాను నిహా తల్లీ’’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వివాహ మహోత్సవంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సుముహూర్త సమయంలో... కన్యాదాన వేళ... శుభలగ్న వేళ..., వధూవరుల పూజా సమయం... -
8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం
భీమవరం క్రైం : హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన సహ విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆ కళాశాలలో బీటెక్ (మెకానికల్) సెకండియర్ చదువుతున్న ఆరేటి మధుదాన వెంకట చైతన్య (19) పేర్కొన్నాడు. భీమవరానికి చెందిన ఆరేటి మాణిక్యాలరావు (చిట్టిబాబు) కుమారుడైన చైతన్య సహవిద్యార్థులతో కలసి స్టడీ టూర్ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఫోన్లో అతడితో మాట్లాడగా... ‘మా కళాశాల నుంచి మొత్తం 8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం. మెకానికల్ బ్రాంచికి చెందిన మేమంతా మనాలి నుంచి బస్సులో వెళుతున్నాం. ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచికి చెందిన విద్యార్థులంతా మరో బస్సులో మనాలికి వెళుతూ లార్జి డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు ఆగారు. ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన 15 నిముషాలకు మేమంతా డ్యామ్ వద్దకు చేరుకున్నాం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏం జరిగిందని అక్కడి వారిని అడగ్గా మా కాలేజీ విద్యార్ధులు గల్లంతయ్యారని చెప్పారు. మాకు కాళ్లు, చేతులు ఆడలేదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ప్రస్తుతం మేమంతా ఢిల్లీ చేరుకున్నాం. మంగళవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాం’ అని చెప్పాడు. క్షేమమని తెలిసినా.. భయమేసింది ప్రమాదం జరిగిన విషయాన్ని టీవీలో చూశానని.. దీంతో తనకు చాలా భయమేసిందని చైతన్య తండ్రి మాణిక్యాలరావు తెలిపారు. ఒకపక్క కంగారు పడుతూనే తన కుమారుడు చైతన్యకు ఫోన్ చేశానని, క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నానని చెప్పారు. అయినా అంతమంది విద్యార్థులు గల్లంతవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. చేతికి అందివచ్చిన పిల్లలు చనిపోతే వారి తల్లితండ్రులు పడే నరకయాతన అంతాఇంతా కాదన్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులకు చాలా బాధను అనుభవించాల్సి వస్తుందని కన్నీరుమున్నీరయ్యారు.