Team India Former Head Coach Ravi Shastri New Stylish Look Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ravi Shastri New Look: న్యూలుక్స్‌తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్‌

Published Fri, May 20 2022 1:40 PM | Last Updated on Fri, May 20 2022 3:58 PM

Team India Former Head Coach Ravi Shastri New Look Tweet Was Viral - Sakshi

రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి శుక్రవారం కొత్త లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ మధ్య కాలంలో క్రికెట్‌ అంశాలు తప్ప రవిశాస్త్రి గురించి పెద్దగా చర్చించుకోవాల్సింది ఏం లేదు. అయితే తాజాగా ట్విటర్‌ వేదికగా రవిశాస్త్రి రిలీజ్‌ చేసిన రెండు ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. క్రికెటర్‌ రవిశాస్త్రిలా కాకుండా స్వాగ్‌లుక్‌తో అదరగొడుతున్నాడు.

తొలి ఫోటోలో ఫ్లాషీ జాకెట్‌తో.. మెడల్‌ గోల్డ్‌ చైన్‌.. కూలింగ్‌ గ్లాసెస్‌.. ఎవరికో చేతులు ఊపుతూ రస్టిక్‌ లుక్‌లో కనిపించాడు. ''నా ఫ్యామిలీ ముంబైలో ఉంది.. నేను ఈ క్షణంతో గడుపుతున్నా'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇక రెండో ఫోటోలో గుడ్‌మార్నింగ్‌ చెబుతూ.. ''నిద్రపోని వారికి గుడ్‌ మార్నింగ్‌ అనేది ఆప్షనల్‌గా కనిపిస్తుంది.'' అని పేర్కొన్నాడు. ఇక చివరగా మూడో ఫోటోను రిలీజ్‌ చేశాడు. ఆ ఫోటోలో ఒకావిడతో చాట్‌ చేస్తూ కనిపించిన రవిశాస్త్రి.. ''నేను ఆమె కలలో ఉన్నాను.. అయితే ఆమె మాత్రం నా వీఐపీ గెస్ట్‌లిస్ట్‌లో ఒకరు'' అంటూ క్యాప్షన్‌ పేర్కొన్నాడు.

రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్‌ 2022(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బ్రాడ్‌కాస్ట్‌ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్‌, ఆటతీరు, ఫామ్‌ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్‌ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్‌-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో భారత​ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్‌ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: Babar Azam: నిబంధన తుంగలో తొక్కిన పాక్‌ కెప్టెన్‌.. పీసీబీ సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement