Mahesh Babu Shares His Latest Gym Workout Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mahesh Babu New Look: ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసిన మహేశ్‌, సూపర్‌ స్టార్‌ బీస్ట్‌ లుక్‌కి ఫిదా!

Mar 2 2023 12:51 PM | Updated on Mar 2 2023 1:16 PM

Mahesh Babu Shares His Latest Workout Photos From GYM - Sakshi

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అభిమానుల్లో ఆయనకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్టార్‌ రేంజ్‌లో ఆయన దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేశ్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో వరల్డ్‌ చిత్రం చేయబోతున్నాడు.

చదవండి: ఈ వారం కొత్త కంటెంట్‌తో ఓటీటీలు రెడీ, ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌!

ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్‌ తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు. మహేశ్‌ ఇప్పటి వరకు కామ్‌ అండ్‌ కూల్‌ చిత్రాలే చేశాడు. తెరపై ఆయన సిక్స్‌ ప్యాక్‌తో కనిపించింది లేదు. ఇక వెండితెరపై అందరి హీరోల్లా ఆయన బాడీ షో చేసిన దాఖలాలు లేవు. కానీ ఆయన తాజా పోస్ట్‌ చూస్తుంటే ఇప్పుడు మహేశ్‌ ఆ రూల్‌ బ్రేక్‌ చేయబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: మంచు వారి ఇంట పెళ్లి భాజాలు? మనోజ్‌ పెళ్లి తేదీ ఫిక్స్‌!

జిమ్‌లో వర్క్‌ అవుట్‌ చేసిన ఫొటోలు షేర్‌ చేశాడు. ఇందులో బైసిప్స్ వర్క్‌ అవుట్‌ అనంతరం నరాలు కనిపిస్తున్న తన బాడీ పిక్స్‌ని షేర్‌ చేశాడు. ఇవి చూసి ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. మహేశ్‌ బీస్ట్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్‌, జక్కన్నయాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రాల కోసమే మహేశ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడా? అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో మహేశ్‌ తన బీస్ట్‌ లుక్‌తో ట్రీట్‌ ఇవ్వబోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement