Actress Jayasudha Shares Her New Look Photo On Twitter, Fans Shocks - Sakshi
Sakshi News home page

Jayasudha: షాకింగ్‌ లుక్‌లో సహజనటి జయసుధ, ఇంతగా మారిపోయారేంటి?

Published Wed, Nov 24 2021 11:13 AM | Last Updated on Wed, Nov 24 2021 11:58 AM

Actress Jayasudha Shares A Photo On Twitter Fans Shocks - Sakshi

Actress Jayasudha Shocking Look Photo Goes Viral: పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’  తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు.

చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ

కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిండు మొహంతో కాస్తా లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. అంతేకాదు చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. తన ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్వీట్‌ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు.

చదవండి: హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్‌

ఇదేంటి ఇలా మారిపోయారు, ముఖంలో మునుపటి కళ లేదు. సహజనటికి నిజంగా ఆనారోగ్య సమస్యలు తలెత్తినంటున్నాయంటూ అంటూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమెకు ఏమైంది, విదేశాలకు ఎందుకు వెళ్లారనేది  స్వయంగా ఆమె స్పందించే వరకు వేచి చూడాలి. జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత. ఆమె భర్త నితిన్‌ కపూర్‌ 2017లో మరణించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement