ఇస్లామాబాద్: దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిని జాతిపితగా గుర్తిస్తారు. ఆయన పట్ల యావత్‌దేశ ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనను మనతో పాటు ప్రపంచ దేశాలన్ని అపారంగా గౌరవిస్తాయి. గాంధీ అంటే ఇండియా అనేంతగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే మన దాయాది దేశం పాకిస్తాన్ ఓ తింగరి పని చేసి పాపం ఆ దేశ జాతిపిత పరువు తీసింది. కరెన్సీ నోట్లు, కాలేజీలు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన వాటికి జాతిపిత పేరు పెడతాం. అయితే పాక్ ఏకంగా వారి జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరిట ఓ మద్యం బాటిల్‌ని విడుదల చేసి ఆయన పరువు మంట గలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జిన్నా, జిన్‌ల కాంబినేషన్‌తో ఈ మద్యం తయారయ్యిందనే ఉద్ధేశంతో ఈ పేరు పెట్టినట్లు దీని తయారీదారులు పేర్కొన్నారు.
‘మ్యాన్ ఆఫ్ ప్లెజర్ జిన్నా స్మృతిలో’ అంటూ జిన్ బాటిల్‌ని విడుదల చేశారు. ఇక జిన్నా ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారో.. పాకిస్తాన్ పట్ల ఆయన వైఖరి ఏలాంటిదో.. చివరకు అమెరికా వల్ల ఆ దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది వంటి వివరాలు బాటిల్ లేబుల్‌పై ముద్రించారు. 1977 లో యుద్ధ చట్టాన్ని ప్రకటించిన తరువాత అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి అధికారాన్ని కొల్లగొట్టిన పాకిస్తాన్ ఫోర్ స్టార్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ గురించి కూడా ఈ లేబుల్ మీద ఉంది. జియా-ఉల్-హక్ మార్గాలను జిన్నా ఎలా వ్యతిరేకించేవాడో లేబుల్ మీద పేర్కొన్నారు. ఎందుకంటే జిన్నా పూల్ బిలియర్డ్, సిగార్లు, సాసేజ్‌లు, చక్కటి స్కాచ్ విస్కీలను ఆస్వాదించే వ్యక్తి అని లేబుల్ మీద పేర్కొన్నారు. (చదవండి: యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!)
'In the memory of the man of pleasure': Alcoholic drink named after Pak founder Jinnah
— ANI Digital (@ani_digital) December 1, 2020
Read @ANI Story | https://t.co/qiuEs1LYdc pic.twitter.com/sYIgKZlyZc
తమ జాతిపిత జిన్నా పేరు మీద ఆల్కహాల్ డ్రింక్ ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మద్యం సేవించడం హానికరం. అలాంటిది దానికి ఏకంగా జాతిపిత పేరు పెట్టడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment