Mohammad Ali Jinnah
-
పాకిస్తాన్ తింగరి పని.. ఫోటోలు వైరల్
ఇస్లామాబాద్: దేశానికి ఎనలేని సేవ చేసి ప్రజల్లో హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తిని జాతిపితగా గుర్తిస్తారు. ఆయన పట్ల యావత్‌దేశ ప్రజలు ఎంతో గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తారు. మన జాతిపిత మహాత్మా గాంధీ. ఆయనను మనతో పాటు ప్రపంచ దేశాలన్ని అపారంగా గౌరవిస్తాయి. గాంధీ అంటే ఇండియా అనేంతగా ఆయన ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే మన దాయాది దేశం పాకిస్తాన్ ఓ తింగరి పని చేసి పాపం ఆ దేశ జాతిపిత పరువు తీసింది. కరెన్సీ నోట్లు, కాలేజీలు, ఆస్పత్రులు వంటి ముఖ్యమైన వాటికి జాతిపిత పేరు పెడతాం. అయితే పాక్ ఏకంగా వారి జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరిట ఓ మద్యం బాటిల్‌ని విడుదల చేసి ఆయన పరువు మంట గలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జిన్నా, జిన్ల కాంబినేషన్‌తో ఈ మద్యం తయారయ్యిందనే ఉద్ధేశంతో ఈ పేరు పెట్టినట్లు దీని తయారీదారులు పేర్కొన్నారు. ‘మ్యాన్ ఆఫ్ ప్లెజర్ జిన్నా స్మృతిలో’ అంటూ జిన్ బాటిల్‌ని విడుదల చేశారు. ఇక జిన్నా ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారో.. పాకిస్తాన్ పట్ల ఆయన వైఖరి ఏలాంటిదో.. చివరకు అమెరికా వల్ల ఆ దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది వంటి వివరాలు బాటిల్ లేబుల్‌పై ముద్రించారు. 1977 లో యుద్ధ చట్టాన్ని ప్రకటించిన తరువాత అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి అధికారాన్ని కొల్లగొట్టిన పాకిస్తాన్ ఫోర్ స్టార్ జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ గురించి కూడా ఈ లేబుల్ మీద ఉంది. జియా-ఉల్-హక్ మార్గాలను జిన్నా ఎలా వ్యతిరేకించేవాడో లేబుల్ మీద పేర్కొన్నారు. ఎందుకంటే జిన్నా పూల్ బిలియర్డ్, సిగార్లు, సాసేజ్లు, చక్కటి స్కాచ్ విస్కీలను ఆస్వాదించే వ్యక్తి అని లేబుల్ మీద పేర్కొన్నారు. (చదవండి: యువ నేతతో దావుద్ ప్రేయసి వివాహం..!) 'In the memory of the man of pleasure': Alcoholic drink named after Pak founder Jinnah Read @ANI Story | https://t.co/qiuEs1LYdc pic.twitter.com/sYIgKZlyZc — ANI Digital (@ani_digital) December 1, 2020 తమ జాతిపిత జిన్నా పేరు మీద ఆల్కహాల్ డ్రింక్ ఉందని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మద్యం సేవించడం హానికరం. అలాంటిది దానికి ఏకంగా జాతిపిత పేరు పెట్టడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రాహుల్ జిన్నా అయితే బావుంటుంది : జీవీఎల్
న్యూఢిలీ: ‘తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాహుల్ జిన్నా అనే పేరు అయితే సరిగా సెట్ అవుతుందని విమర్శించారు. ముస్లింలను మెప్పించేలా రాజకీయాలు చేస్తున్నా రాహుల్‌కు సావర్కర్ అనే పేరు కంటే ముహమ్మద్ అలీ జిన్నా పేరు అయితే కరెక్ట్‌గా సరిపోతుందని ఎద్దేవా చేస్తూ ట్విట్ చేశారు. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు : ఢిల్లీలో జరిగిన భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని అన్నారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ.. భారత్ బచావ్ కాదని, కాంగ్రెస్ బచావో అని జీవీఎస్ ఎద్దేవా చేశారు. కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారంటూ హేళన చేశారు. అధికారం రాని కారణంగా వారు (కాంగ్రెస్ పార్టీ) పడుతున్న బాధలను ప్రదర్శించడానికే ఈ ర్యాలీని నిర్వహించారని కాంగ్రెస్ పార్టీని జీవీఎల్ నరసింహరావు దుయ్యబట్టారు. The more appropriate name for you @RahulGandhi is RAHUL JINNAH. Your Muslim appeasement politics and mindset makes you a worthy legatee of Mohammad Ali Jinnah, not Savarkar. #RahulJinnah https://t.co/NzvAmuLxQB — GVL Narasimha Rao (@GVLNRAO) December 14, 2019 ఇక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భారత ఆర్థికవ్యవస్థను నాశనం చేశారని రాహుల్‌గాంధీ ఆరోపణలు చేయడాన్ని తప్పుపడుతూ.. దేశ శత్రువులందరూ భారతదేశానికి బలమైన ఆర్థిక వ్యవస్థను నాశనం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. -
అబ్దుల్ భట్ బ్రాహ్మణుడే: ఉండవల్లి
సాక్షి, రాజమండ్రి : గాంధీజీ- నెహ్రూ వేర్వేరు కాదని.. గాంధీ ఏం చెప్పారో.. నెహ్రూ అదే చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో కర్ఫ్యూ నడిపిస్తోందని విమర్శించారు. మంగళవారం ఉండవల్లి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని అమిత్ షా చెబుతున్నారు. పాకిస్తాన్ కూడా మనదే. గాంధీని, నెహ్రూను, కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ఎన్నడూ సమర్థించలేదు... ఆయన వాస్తవాలను మాత్రమే చెప్పారు. నిజానికి ఆర్టికల్ 370ని రద్దు చేస్తాననడంలో తప్పులేదు. బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతం మీద. ఆర్టికల్ రద్దు అనేది డిప్లమసీతో చేయాలి. సైన్యంతో కాదు’ అని మోదీ సర్కారు తీరును విమర్శించారు. ఆయన బ్రాహ్మణుడే పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ జిన్నా తాత రాజ్‌పూత్ వంశానికి చెందినవారు. అబ్దుల్ భట్ కూడా బ్రాహ్మణుడే. వీరంతా ఇస్లాంలోకి వెళ్లినవారే. సాయిబాబా గుడికి వెళ్లొద్దని శంకరాచ్యా పీఠాధిపతే చెప్పారు. నల్లధనానికి నోట్లరద్దు ఎలా పరిష్కారం కాదో... ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాదు. అంతేకాదు ఈరోజు గూగుల్ సెర్చ్‌లో ఆర్టికల్ 370 అనేది లేదు. కశ్మీర్ ఎంపీలు కూడా భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం గాంధీ సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తోంది’ అని విమర్శలు గుప్పించారు. -
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
మీసాలు తీసేస్తేనే మ్యారేజ్..
-మహ్మద్ ఆలీ జిన్నాకు ప్రియురాలి కండిషన్ -సీనియర్ జర్నలిస్ట్ షీలా రెడ్డి రాసిన పుస్తకంలో ఆసక్తికర అంశాలు న్యూఢిల్లీ: ‘పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ ఆలీ జిన్నా 40వ ఏట.. ఓ టీనేజ్ యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ యువతి జిన్నాకు ఒక కండిషన్ పెట్టింది. మీసాలు తీస్తేనే మ్యారేజ్ అని చెప్పింది. ఇందుకు అంగీకరించిన జిన్నా మీసాలు తీయడమే కాదు. తన హెయిర్‌స్టయిల్ కూడా మార్చేసుకున్నారు..’ జిన్నాకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను సీనియర్ జర్నలిస్ట్ షీలా రెడ్డి రచించిన ‘‘మిస్టర్ అండ్ మిస్ట్రెస్ జిన్నా- ది మ్యారేజ్ దట్ షుక్ ఇండియా’’ పుస్తకంలో వెల్లడించారు. ఆ పార్సీ యువతి రుట్టీ పెటిట్‌ను జిన్నా పెళ్లి చేసుకోవడంలో ట్విస్ట్‌లను వివరించారు. ఒకానొక సందర్భంలో పెటిట్ తండ్రి దిన్షా మానెక్జీ పెటిట్తో మాటల సందర్భంగా.. మతాంతర వివాహాలపై మీ అభిప్రాయం ఏమిటని జిన్నా ప్రశ్నించారట. దానికి మానెక్జీ స్పందిస్తూ.. ఇది దేశ సమగ్రతకు ఎంతో సహకరిస్తుందని చెప్పారట. అప్పుడు జిన్నా.. అయితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా’నని చెప్పారట. దాంతో ఆగ్రహించిన మానెక్జీ జిన్నాను బయటకు గెంటివేసి.. మళ్లీ జిన్నాతో మాట్లాడకపోయిన అంశాన్ని షీలా తన పుస్తకంలో ఆసక్తికరంగా మలిచారు. రుట్టీకి 18 ఏళ్లు నిండిన తర్వాత ముంబైలోని జిన్నా హౌస్‌లో 1918లో ఆమెను జిన్నా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి ఆమె తరఫు బంధువులెవరూ హాజరుకాలేదు. పెళ్లి తర్వాత ఇస్లాంలోకి మారిన రుట్టీ తన పేరును మరియం కింద మార్చుకున్నారని షీలా రెడ్డి వివరించారు. ఈ లవ్ స్టోరీలో విషాదం ఏంటంటే.. 1929లో రుట్టీ కేన్సర్‌తో మరణించారు. దేశ విభజన తర్వాత భారత్‌ను వీడి పాక్‌కు తరలిపోయే సమయంలో జిన్నా.. రుట్టీ సమాధిని దర్శించి వెళ్లారని షీలా తెలిపారు. ఈ పుస్తకాన్ని రాయడానికి గల కారణాలను కూడా షీలా వివరించారు. నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలో ఖాళీ సమయంలో రుట్టీ.. సరోజినీ నాయుడు కుమార్తెలకు రాసిన లేఖలను పరిశీలించిన తర్వాత పుస్తకం రాసే నిర్ణయాని వచ్చానని పేర్కొన్నారు. దాని గురించి పాక్‌లో కూడా పర్యటన, అక్కడి జిన్నా ఫ్యామిలీ తిరస్కరించిన వైనాన్ని షీలా వివరించారు. జిన్నా ముంబైలోనే ఎక్కువ కాలం ఉండటంతో మళ్లీ ముంబై వచ్చి అక్కడ లభించిన సమాచారంతో జిన్నా జీవితంపై ఈ పుస్తకాన్ని షీలా వెలువరించారు.