
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment