Samajwadi Party MP
-
‘స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, జిన్నా సమానం’
అలీగఢ్: భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూలతో సమానంగా మొహమ్మద్ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మతం, కులం ప్రాతిపదికన ప్రజలను విడదీసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మరోవైపు, ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ జిన్నాను భారత్ ఎప్పుడూ దిగ్గజ నాయకుడిగా భావించలేదన్నారు. జిన్నా పేరిట బీజేపీ కృత్రిమ సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా అలీగఢ్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులు తరగతులకు హాజరుకాబోమని వారు తేల్చి చెప్పారు. -
వీడియో సాక్ష్యం.. చిక్కుల్లో నటుడు సంజయ్!
లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని ఓ స్థానిక కోర్టు బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కు సమన్లు జారీ చేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు గానూ వచ్చే నవంబర్ 16న సంజయ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రసంగిస్తూ మాయావతిపై అసభ్యవ్యాఖ్య చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో అడిషనల్ చీఫ్ మేజిస్ట్రేట్ సంజయ్ యాదవ్ బుధవారం సంజయ్ కి సమన్లు జారీ చేశారు. సంజయ్ విచారణకు హాజరయ్యేలా చూడాలని ముంబయి కమిషనర్ కు కోర్టు సూచించింది. సంజయ్ కేసులో వీడియో సాక్ష్యాలున్నాయని జారీ చేసిన సమన్లలో కోర్టు స్పష్టం చేసింది. అసలు వివాదం ఏంటి? 2009లో జరిగిన యూపీ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి నటుడు సంజయ్ దత్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో సంజయ్ తాను నటించిన 'మున్నాభాయ్' మూవీల్లోని ఓ మ్యానరిజం 'జాదు కి ఝప్పి' (కౌగిలించుకోవడం) ను ప్రదర్శించారు. బీఎస్పీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందున ఆ పార్టీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అవసరమైతే మీకు ఒకటి (కౌగిలింత) ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో వివాదానికి దారితీసిన ఈ ప్రచారం కేసు తుది దశకు చేరుకుంది. నటుడికి చిక్కులు తెచ్చిన వీడిమో -
ఎంపీ గారి మేకలు దొరికాయ్!
భోపాల్ : తమ తోటలోని మేకల్ని దొంగలు ఎత్తుకెళ్లారని ఓ ఎంపీ సోదరుడు ఫిర్యాదు చేయడం ఆలస్యం.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. 24 గంటల్లో తప్పిపోయిన మేకల్ని స్వాధీనం చేసుకుని స్వామిభక్తిని చాటుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ చౌధురీ మునవ్వర్ సలీం తోటలోని 23 మేకల్ని ఎవరో దొంగలించారు. దీంతో ఎంపీ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. చివరికి 17 మేకల్ని స్వాధీనం చేసుకున్నారు. ముర్వా గ్రామ సమీపంలోని అడవిలో ఈ మేకల్ని కనుగొన్నామని.. మూడు మేకలు కుక్కల దాడిలో చనిపోయాయని స్టేషన్ ఇన్చార్జ్ హెచ్ఎస్ రావత్ తెలిపారు. ఇంకా కనిపించని మూడుమేకల్ని త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని మీడియాకు తెలిపారు. గ్రామస్తులు గమనించడంతో దొంగలు మేకల్ని వదిలి పరారై ఉంటారని రావత్ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నందుకు ఎంపీ పోలీసుల్ని అభినందించారు. అపహరణకు గురైన మేకలు అల్వారీ జాతికి చెందినవని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా ఎస్పీ సీనియర్ నేత, యూపీ మంత్రి అజామ్ ఖాన్‌కు చెందిన 7 గేదెలు తప్పిపోవడంతో పోలీసులు ఈ స్థాయిలోనే స్పందించారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు క్రైమ్ బ్రాంచ్, సాధరణ పోలీసులు కలిసి చివరికి ఎలాగోలా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసుల అత్యుత్సాహంపై పలు విమర్ళలు చెలరేగాయి. -
ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకుంటా!: ఎంపీ
భోపాల్: సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌధరీ మనవార్ సలీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ హై కమిషన్ అధికారితో తనకు సంబంధాలు ఉన్నాయని నిఘా విభాగాలు నిరూపిస్తే కుటుంబంతో సహా తాను ఆత్మహత్య చేసుకుంటానని శనివారం రాత్రి ఆయన అన్నారు. పీఏ అరెస్ట్ పై సలీమ్ స్పందిస్తూ.. తాను ఢిల్లీ పోలీసులతో సహా మూడు సంస్థలు ఎంక్వయిరీ చేసిన తర్వాతే ఫర్హాత్ ను తన వద్ద జాయిన్ చేసుకున్నానని చెప్పారు. కొన్ని రోజుల కిందట గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహ్మద్ అక్తర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఎస్పీ ఎంపీ సలీమ్ వ్యక్తిగత కార్యదర్శి ఫర్హాత్ ను అరెస్ట్ చేశారు. పాక్ హై కమిషన్ ఉద్యోగి అక్తర్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఎంపీ పీఏను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫర్హాత్ కు తాను రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పాక్ గూఢచారి అక్తర్ పోలీసుల విచారణలో తెలిపాడు. మధ్యప్రదేశ్ లో తమ పార్టీ రాజకీయాల్లో కీలకవ్యక్తి అయిన సలీమ్ ను ఎస్పీ అధినేత ములాయం సింగ్ 2012లో రాజ్యసభకు ఎంపిక చేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో ముస్లింల ఓట్లను సంపాదించడానికి ఆయనకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఒకవైపు ఉత్తరప్రదేశ్ లో పార్టీలో కీలకనేతల మధ్య రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఎస్పీకి చెందిన ఓ ఎంపీ గూఢచర్యం లాంటి పెద్ద సమస్యలో చిక్కుకోవడం గమనార్హం.