లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని ఓ స్థానిక కోర్టు బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కు సమన్లు జారీ చేసింది. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు గానూ వచ్చే నవంబర్ 16న సంజయ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రసంగిస్తూ మాయావతిపై అసభ్యవ్యాఖ్య చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో అడిషనల్ చీఫ్ మేజిస్ట్రేట్ సంజయ్ యాదవ్ బుధవారం సంజయ్ కి సమన్లు జారీ చేశారు. సంజయ్ విచారణకు హాజరయ్యేలా చూడాలని ముంబయి కమిషనర్ కు కోర్టు సూచించింది. సంజయ్ కేసులో వీడియో సాక్ష్యాలున్నాయని జారీ చేసిన సమన్లలో కోర్టు స్పష్టం చేసింది.
అసలు వివాదం ఏంటి?
2009లో జరిగిన యూపీ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి నటుడు సంజయ్ దత్ ప్రచారం చేశారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో సంజయ్ తాను నటించిన 'మున్నాభాయ్' మూవీల్లోని ఓ మ్యానరిజం 'జాదు కి ఝప్పి' (కౌగిలించుకోవడం) ను ప్రదర్శించారు. బీఎస్పీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందున ఆ పార్టీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అవసరమైతే మీకు ఒకటి (కౌగిలింత) ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో వివాదానికి దారితీసిన ఈ ప్రచారం కేసు తుది దశకు చేరుకుంది.
నటుడికి చిక్కులు తెచ్చిన వీడిమో
Comments
Please login to add a commentAdd a comment