గుత్తికోయలతో శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మడకం తుల(37), మంగ(43) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి కసులో ఎవరెవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు.
శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటనకు ముందు గుత్తికోయలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెంబాలపాడు అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే గుత్తికోయలు ఫారెస్ట్ అధికారిని చంపినట్లు తెలుస్తోంది.
చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు..
ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం
Comments
Please login to add a commentAdd a comment