tribals Attack
-
దాడికి ముందు గుత్తికోయలతో ఎఫ్ఆర్వో.. ఫోటో వైరల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మడకం తుల(37), మంగ(43) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి కసులో ఎవరెవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటనకు ముందు గుత్తికోయలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెంబాలపాడు అటవీ ప్రాంతంలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే గుత్తికోయలు ఫారెస్ట్ అధికారిని చంపినట్లు తెలుస్తోంది. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు.. ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్‌కు అల్టిమేటం -
Forest Range Officer: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది!
చెట్టమ్మకు చుట్టమైండు. అడవి తల్లికి దడి కట్టిండు. దండెత్తిన మూకలను తరిమికొట్టిండు. పచ్చదనాన్ని కాపాడినందుకు మావోల హిట్లిస్ట్కెక్కిండు. చివరికి గొత్తికోయల చేతిలో హత్యకు గురైండు. ఇప్పుడా వనం కన్నీళ్లు కారుస్తోంది. చెట్లన్నీ నిలబడి సంతాపం తెలుపుతున్నాయి. ‘శ్రీనివాస్ అమర్ రహే’ అని మౌనంగా నినదిస్తున్నాయి. – బయ్యారం సాక్షి, మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేశారు. 2011 నుంచి 2018 వరకు బయ్యారం అటవీశాఖ డీఆర్ఓగా శ్రీనివాసరావు పని చేశారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. అటవీరక్షణకు ఈప్రాంతంలోని సాయుధ దళాలతో పాటు లీగల్‌గా గట్టిపట్టు ఉన్న న్యూడెమోక్రసీ పార్టీని ఢీకొన్నారు. అటవీ రక్షణకు వెనకడుగు వేయలేదు. 2018లో పదోన్నతిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా విధుల్లో చేరారు. ఆసమయంలో అటవీ రక్షణకు తనదైన శైలిలో పని చేశారు. దీంతో పోడు, సాగుదారుల ఫిర్యాదుల ఆధారంగా మావోయిస్టులు ఎఫ్ఆర్ఓను టార్గెట్ చేశారు. ఈవిషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అటవీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ ప్రాణాలు రక్షించుకునేందుకు ఆశాఖ అధికారులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండకు బదిలీ చేశారు. చండ్రుగొండ రేంజ్ పరిధిలో సైతం శ్రీనివాసరావు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా కృషి చేశారు. ఈక్రమంలో ఆప్రాంతానికి వలస వచ్చిన గొత్తికోయలు శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. లింగాలలో కాపాడినా.. చండ్రుగొండలో మాత్రం కాపాడుకోలేకపోయామని అటవీశాఖ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి జిల్లాలో విషాదం... బయ్యారం డీఆర్ఓగా, లింగాల ఎఫ్‌ఆర్‌ఓగా పని చేసిన శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఉమ్మడి జిల్లాలోని అటవీశాఖలో విషాదం నెలకొంది. అటవీ రక్షణకు శ్రీనివాసరావు చేసిన కృషిని ఈసందర్భంగా పలువురు అధికారులు కొనియాడారు. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్ -
ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి వెనక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే ఫారెస్ట్ అధికారిని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో శ్రీనివాస రావు హిట్లిస్టలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావునును గొత్తికోయలు వేట కొడవళ్లతో మెడపై దాడి చేసి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బెదిరింపులకు గురి చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారు. ఈ క్రమంలో శ్రీనివాస రావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు, ఇతర అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఓ వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. పాడే మోసిన మంత్రులు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈర్లపూడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే సమయంలో జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస రావు పాడే మోశారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదని అన్నారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని, సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించి అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని మండిపడ్డారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై కూడా దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటవీశాఖకు ఆయుధాల అంశం శ్రీనివాసరావు మృతితో అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు చేస్తామని అటవీ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతితో ఆయుధాలు లేకుండా అడవిలో డ్యూటీ చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమకు చెప్పారన్నారు. గతంలో కూడా ఆయుధాలు అంశానికి సంబంధించి అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇప్పుడు మళ్ళీ మరోసారి తీసుకెళ్తామన్నారు.. శ్రీనివాసరావుది చివరి మృతి కావాలని ఫారెస్ట్ శాఖలో ఇక ఎవ్వరు చనిపోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉద్రిక్తత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఉద్యోగులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాగా తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు ఇచ్చి అటవీశాఖ అధికారులకు, సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట అటవీ శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఫారెస్ట్ సిబ్బంది నిరసనతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పాత వీడియో వైరల్: ఫారెస్ట్ అధికారి మృతిపై పోలీసుల అనుమానం
-
ఆదివాసీలపై దాడులు అమానుషం: రాహుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆదివాసీలపై, ప్రత్యేకంగా తమ భూమి హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్న మహిళలను ప్రభుత్వం అణచివేయడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పడిందని, ఆదివాసీ హక్కుల పరిరక్షణ అందులో ఒక ముఖ్య భాగమని ఆయన గుర్తుచేశారు. మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల్లో పోడుభూముల వ్యవహారంలో జరుగుతున్న దాడులను ఆయన శనివారం ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఆదివాసీ గొంతును నొక్కేందుకు పోలీసు బలగాలతో అణచివేయడం అన్యాయమని, పోడు భూమి పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ వెంటనే వెనక్కి తగ్గి ప్రజలకు ద్రోహం చేశారని రాహుల్ ఆరోపించారు. ‘జల్–జంగల్–జమీన్’ రక్షణ కోసం వారి పోరాటంలో, తమ ఆదివాసీ సోదర సోదరీమణులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ ట్వీట్ ద్వారా ఆదివాసీల ఉద్యమాన్ని ప్రస్తావించడం, వారికి మద్దతు ప్రకటించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు కర్రలతో దాడి
సాక్షి, మహబూబ్‌నగర్: గంగారం మండలం మడగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడుభూముల్లో సాగు చేస్తున్న ఆదివాసీలను మంగళవారం ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులతో ఆదివాసులు వాగ్వాదానికి దిగారు. గిరిజనులు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం ముదరడంతో ఆదివాసీలు కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. పలువురు గిరిజన మహిళలు సాగును అడ్డుకున్నందుకు అటవీ అధికారులపై దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నలుగురు మావోయిస్టుల అరెస్ట్
అరకులోయ/మల్కన్‌గిరి: ఒడిశా కటాఫ్ ప్రాంతంలోని ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పట్టుబడిన నలుగురు మావోయిస్టుల నుంచి పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ ముగ్గురు మహిళా మావోయిస్టులు, ఓ మిలీషియా సభ్యుడి ఫోటోలను మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గా మోహన్ మిన్నా శనివారం మీడియాకు వెల్లడించారు. ఆండ్రపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న రాజశేఖరకర్మతో పాటు జంత్రి గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు జయంతి గొల్లూరి (20), రాధిక (20), సుమ గొల్లూరి (17)గా పోలీసులు గుర్తించారు. వారి కిట్ బ్యాగ్‌ల నుంచి 3 జిలెటిన్లు, 2 క్రోడాక్స్, వైరు, 2 టిపెన్‌బాక్స్ బాంబులు, ఎలక్ట్రీకల్ వైరును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. గాయాలపాలైన పోలీసులకు పాడేరులో చికిత్స కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు మీనా మృతదేహంతోపాటు, పట్టుబడిన మావోయిస్టులను గ్రేహౌండ్స్ పోలీసులు తరలిస్తున్న సమయంలో కొంతమంది గిరిజనులు అడ్డుకుని పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పలువురు గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివచ్చారు. గాయపడిన 11 మంది గ్రేహౌండ్స్ పోలీసులకు పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు నిడి గొండ ప్రమీల ఉరఫ్ మీనా మృతదేహాన్ని శనివారం ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. -
100 మంది ఒక్కసారిగా దాడి చేయడంతో!
గాంధీనగర్ : మూక దాడులను నిరోధించడడానికి ప్రత్యేక చట్టాలు రూపొందించాలని కోర్టులు ఆదేశించినప్పటికి ప్రభుత్వాలు మాత్రం దాడులను అరికట్టలేకపోతున్నాయి. తాజాగా గుజరాత్‌లోని దాహోడ్ జిల్లాలో ఇద్దరు గిరిజన యువకులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒక యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం ప్రకారం అజ్మల్ వహోనియా (22), భారు మాతూర్ అనే ఇద్దరు యువకులను దొంగలుగా భావించిన గ్రామస్తులు దాదాపు 100 మంది వారిపై శనివారం రాత్రి దాడి చేయడంతో అజ్మల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న అజ్మల్, భారు మాతూర్ రెండు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై బయటకువచ్చారు. బాధితులతో పాటు, దాడికి పాల్పడిన వారందరూ తూర్పు గుజరాత్‌కి చెందిన గిరిజనులు కావడం గమనార్హం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. శనివారం రాత్రి సుమారు 20 మంది గ్రామంలోకి ప్రవేశించారని, ఇందులో ఇద్దరిపై దాడి జరగగా మిగతా 18 మంది పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.