అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు కర్రలతో దాడి | Tribals Attack On Forest Officers In Mahabubnagar Over Land Farming | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు కర్రలతో దాడి

Published Tue, Jul 13 2021 6:45 PM | Last Updated on Tue, Jul 13 2021 7:51 PM

Tribals Attack On Forest Officers In Mahabubnagar Over Land Farming - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: గంగారం మండలం మడగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడుభూముల్లో సాగు చేస్తున్న ఆదివాసీలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులతో ఆదివాసులు వాగ్వాదానికి దిగారు. గిరిజనులు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం ముదరడంతో ఆదివాసీలు కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. పలువురు గిరిజన మహిళలు సాగును అడ్డుకున్నందుకు అటవీ అధికారులపై దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement