
ప్రముఖ సినీ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తేజస్విని నటి జ్యోతి చందేకర్ కుమార్తె.
హౌస్ రెంట్ ఇవ్వడానికి కార్పొరేటర్ ఇంటికి వెళ్తే.. తనతో గడిపేందుకు డైరెక్ట్‌గా రమ్మని పిలిచాడని తేజస్విని తెలిపింది. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వచ్చానని పేర్కొంది.
తేజస్విని మాట్లాడుతూ.. '2009-10 ప్రాంతంలో నేను సింహగడ్ రోడ్‌లో (పుణెలో) అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్‌మెంట్ ఓ కార్పొరేటర్‌కు చెందినది. నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లా. అతను నాకు నేరుగా ఆఫర్ ఇచ్చాడు. అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది. నేను వెంటనే తీసుకుని అతని ముఖం మీద విసిరా. నేను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించలేదు. నా వృత్తి కారణంగా, నా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున ఇలా ప్రవర్తించారు. ఈ సంఘటన నాకు ఓ అనుభవం లాంటిది' అని అన్నారు. కాగా.. 2004లో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment