Marathi cinema
-
రెంట్ ఇవ్వడానికి వెళ్తే.. రేట్ ఎంత అన్నాడు: ప్రముఖ నటి
ప్రముఖ సినీ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. మరాఠి హీరోయిన్ తేజస్విని పండిట్ వేధింపులకు గురైన విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తేజస్విని నటి జ్యోతి చందేకర్ కుమార్తె. హౌస్ రెంట్ ఇవ్వడానికి కార్పొరేటర్ ఇంటికి వెళ్తే.. తనతో గడిపేందుకు డైరెక్ట్‌గా రమ్మని పిలిచాడని తేజస్విని తెలిపింది. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తాను వెంటనే అపార్ట్మెంట్ ఖాళీ చేసి వచ్చానని పేర్కొంది. తేజస్విని మాట్లాడుతూ.. '2009-10 ప్రాంతంలో నేను సింహగడ్ రోడ్లో (పుణెలో) అద్దె అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. అపార్ట్మెంట్ ఓ కార్పొరేటర్‌కు చెందినది. నేను అద్దె చెల్లించడానికి అతని కార్యాలయానికి వెళ్లా. అతను నాకు నేరుగా ఆఫర్ ఇచ్చాడు. అక్కడే టేబుల్ మీద ఒక గ్లాసు నీరు ఉంది. నేను వెంటనే తీసుకుని అతని ముఖం మీద విసిరా. నేను అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించలేదు. నా వృత్తి కారణంగా, నా ఆర్థిక స్థితి బలహీనంగా ఉన్నందున ఇలా ప్రవర్తించారు. ఈ సంఘటన నాకు ఓ అనుభవం లాంటిది' అని అన్నారు. కాగా.. 2004లో కేదార్ షిండే అగా బాయి అరేచాతో తేజస్విని సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. -
బిగ్‌బాస్: హౌస్‌లోకి విడాకులు తీసుకున్న జంట ఎంట్రీ
బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మజా ఇచ్చే షో బిగ్‌బాస్. కొట్లాటలకు కొదువే ఉండదు, ఫన్‌కు సరిహద్దులే ఉండవు. ఇచట ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ దొరుకుతుంది అని నమ్ముతుంటారు టీవీ ఆడియన్స్. సెలబ్రిటీలందరినీ ఓ ఇంట్లో వేసి ఆడించడమే ఈ షో ముఖ్య లక్షణం. ఇటీవలే బిగ్‌బాస్ తెలుగులో ఐదో సీజన్ ప్రారంభమవగా తాజాగా మరాఠీలో మూడో సీజన్ మొదలైంది. మహేశ్ మంజ్రేకర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో సెప్టెంబర్ 19వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈసారి 15 మంది సెలబ్రిటీలు ట్రోఫీ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో ఇప్పటికే విడాకులు తీసుకున్న జంట కూడా ఉంది. సాధారణంగా సెలబ్రిటీ కపుల్ హౌస్‌లోకి అడుగు పెట్టడం చూశాం, కానీ మరాఠీ బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇదివరకే విడాకులు తీసుకున్న జంటను కంటెస్టెంట్లుగా లోనికి పంపించారు. నటి స్నేహ వాగ్ ఆమె మాజీ భర్త, నటుడు ఆవిశ్కర్ దర్వేకర్ మరాఠీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొన్నారు. స్నేహకు 19 ఏళ్ల వయసులోనే ఆవిశ్కర్తో పెళ్లి జరిగింది. కొన్నేళ్లపాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆవిశ్కర్ తనను హింసిస్తున్నాడంటూ భర్త మీద గృహ హింస ఆరోపణలు చేసింది స్నేహ. ఈ క్రమంలో అతడితో కలిసి జీవితం కొనసాగించడం ఇష్టం లేక భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటారు? ఒకవేళ బిగ్‌బాస్ వాళ్లను మళ్లీ కలుపుతుందా? కనీసం వారిని స్నేహితులుగానైనా మార్చుతుందా? లేదా బద్ధ శత్రువులను చేస్తుందా? అన్నది చూడాల్సిందే! ఈ మాజీ దంపతులతో పాటు ఈ సీజన్‌లోలో ఉత్కర్ష్ షిండే, తృప్తి దేశాయ్, విశాల్, శివలీలా పాటిల్, వికాస్ పాటిల్, గాయత్రి దాతర్, అక్షయ్ వాగ్మేర్, సంతోష్ చౌదరి, మీనాల్ షా, మీరా జగన్నాథ్, సురేఖ, జై డూదేన్, సోనాలి పాటిల్ పాల్గొన్నారు. -
ఆర్ట్ డైరెక్టర్ ఆత్మహత్య
సాక్షి ముంబై: మరాఠీ సినిమా, బుల్లితెర ఆర్ట్ డైరెక్టర్ రాజు సాపతే పుణేలోని తన ఇంట్లో శనివారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ‘అగోబాయి సూన్బాయి’, ‘కాయ్ గడ్లా త్యా రాత్రి’, ‘మన్యా ది వండర్ బాయి’, సాంటలోట్’, ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’, మొదలగు సినిమాలకు రాజు ఆర్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. కాగా, రాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ వీడియాలో చలనచిత్ర యూనియన్ అధికారి రాకేష్ మౌర్యా డబ్బులు కోసం వేధిస్తున్నాడని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వీడియో మరాఠీ చలన చిత్రరంగంలో తీవ్ర కలకలాన్ని రేకేత్తించింది. రాజు సాపతే గత 22 ఏళ్లుగా సినీ, బుల్లితెర రంగంలో ఉన్నారు. కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయంలో కూడా ఆయన వద్ద 5 బుల్లితెర సీరియల్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిసింది. ఈ సంఘటనతో యూనియన్ల బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. -
నటి ఇంట్లో కత్తితో చొరబడ్డ దుండగుడు, తండ్రికి గాయాలు
పుణె: మరాఠీ నటి సోనాలీ కులకర్ణి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ఆయుధాలతో చొరబడి హల్చల్ చేశాడు. మహారాష్ట్రలోని పుణెలో పింప్రి చించ్‌వాద్‌లో నివాసముంటున్న సోనాలీ ఇంట్లోకి మంగళవారం నాడు ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఒక ఫేక్ గన్, కత్తితో టెర్రస్ పై నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడిని చూసిన పని మనిషి భయంతో బిగుసుకుపోగా, తన వెనక పోలీసులు ఉన్నారని, కాబట్టి చప్పుడు చేయకుండా తను ఎక్కడ దాక్కోవాలో చెప్పమని ఆదేశించాడు. ఇంతలో నటి తండ్రి మనోహర్ ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కత్తితో దాడి చేయడంతో మనోహర్‌కు గాయాలయ్యాయి. అనంతరం అతడు వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, అప్పటికే అప్రమత్తమైన కాలనీవాసులు అతడిని చేజిక్కించుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే సదరు వ్యక్తి సోనాలి అభిమాని అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఫోటో చూసి ఇరా ఖాన్ ఏమందంటే.. విడాకులు రాకముందే.. కోటీశ్వరుల క్యూ -
మాధురి.. ఓ మంచి నిర్మాత!
బాలీవుడ్ బ్యూటీలు ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ కేవలం నటనపైనే దృష్టి పెట్టడం లేదు. నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కూడా చేరారు. ఆర్.ఎన్.ఎం. మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌ని ఆరంభించారు. స్వప్ననీల్ జయకర్ దర్శకత్వంలో త్వరలో ఓ మరాఠీ చిత్రాన్ని ఆమె నిర్మించనున్నారు. ‘‘సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. యోగేశ్ వినాయక్ జోషి ఈ సినిమాకి మంచి కథ అందించారు. మంచి టీమ్‌తో ఈ సినిమా నిర్మించబోతున్నాం. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా మంచి నటి అనిపించుకున్నా. ఈ సినిమాతో మంచి నిర్మాత అని కూడా అనిపించు కుంటా’’ అని మాధురి అన్నారు.