బిగ్‌బాస్‌: హౌస్‌లోకి విడాకులు తీసుకున్న జంట ఎంట్రీ | Bigg Boss 3 Marathi: Divorce Couple In BB3 House, Details Inside | Sakshi
Sakshi News home page

Bigg Boss: కంటెస్టెంట్లుగా ఇదివరకే విడాకులైన దంపతులు, ఇదే తొలిసారి!

Published Mon, Sep 20 2021 8:51 PM | Last Updated on Mon, Sep 20 2021 9:44 PM

Bigg Boss 3 Marathi: Divorce Couple In BB3 House, Details Inside - Sakshi

బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్‌ మజా ఇచ్చే షో బిగ్‌బాస్‌. కొట్లాటలకు కొదువే ఉండదు, ఫన్‌కు సరిహద్దులే ఉండవు. ఇచట ఎంటర్‌టైన్‌మెంట్‌ టన్నుల కొద్దీ దొరుకుతుంది అని నమ్ముతుంటారు టీవీ ఆడియన్స్‌. సెలబ్రిటీలందరినీ ఓ ఇంట్లో వేసి ఆడించడమే ఈ షో ముఖ్య లక్షణం. ఇటీవలే బిగ్‌బాస్‌ తెలుగులో ఐదో సీజన్‌ ప్రారంభమవగా తాజాగా మరాఠీలో మూడో సీజన్‌ మొదలైంది. మహేశ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో సెప్టెంబర్‌ 19వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈసారి 15 మంది సెలబ్రిటీలు ట్రోఫీ కోసం పోటీపడుతున్నారు.

అయితే ఇందులో ఇప్పటికే విడాకులు తీసుకున్న జంట కూడా ఉంది. సాధారణంగా సెలబ్రిటీ కపుల్‌ హౌస్‌లోకి అడుగు పెట్టడం చూశాం, కానీ మరాఠీ బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారిగా ఇదివరకే విడాకులు తీసుకున్న జంటను కంటెస్టెంట్లుగా లోనికి పంపించారు. నటి స్నేహ వాగ్‌ ఆమె మాజీ భర్త, నటుడు ఆవిశ్కర్‌ దర్వేకర్‌ మరాఠీ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్నారు. స్నేహకు 19 ఏళ్ల వయసులోనే ఆవిశ్కర్‌తో పెళ్లి జరిగింది. కొన్నేళ్లపాటు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది.

తర్వాత ఏమైందో ఏమో కానీ ఆవిశ్కర్‌ తనను హింసిస్తున్నాడంటూ భర్త మీద గృహ హింస ఆరోపణలు చేసింది స్నేహ. ఈ క్రమంలో అతడితో కలిసి జీవితం కొనసాగించడం ఇష్టం లేక భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటారు? ఒకవేళ బిగ్‌బాస్‌ వాళ్లను మళ్లీ కలుపుతుందా? కనీసం వారిని స్నేహితులుగానైనా మార్చుతుందా? లేదా బద్ధ శత్రువులను చేస్తుందా? అన్నది చూడాల్సిందే! ఈ మాజీ దంపతులతో పాటు ఈ సీజన్‌లోలో ఉత్కర్ష్‌ షిండే, తృప్తి దేశాయ్‌, విశాల్‌, శివలీలా పాటిల్‌, వికాస్‌ పాటిల్‌, గాయత్రి దాతర్‌, అక్షయ్‌ వాగ్‌మేర్‌, సంతోష్‌ చౌదరి, మీనాల్‌ షా, మీరా జగన్నాథ్‌, సురేఖ, జై డూదేన్‌, సోనాలి పాటిల్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement