
సాక్షి ముంబై: మరాఠీ సినిమా, బుల్లితెర ఆర్ట్ డైరెక్టర్ రాజు సాపతే పుణేలోని తన ఇంట్లో శనివారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ‘అగోబాయి సూన్‌బాయి’, ‘కాయ్ గడ్‌లా త్యా రాత్రి’, ‘మన్యా ది వండర్ బాయి’, సాంటలోట్’, ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’, మొదలగు సినిమాలకు రాజు ఆర్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. కాగా, రాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు ఓ సెల్ఫీ వీడియో తీశాడు.
ఈ వీడియాలో చలనచిత్ర యూనియన్ అధికారి రాకేష్ మౌర్యా డబ్బులు కోసం వేధిస్తున్నాడని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ వీడియో మరాఠీ చలన చిత్రరంగంలో తీవ్ర కలకలాన్ని రేకేత్తించింది. రాజు సాపతే గత 22 ఏళ్లుగా సినీ, బుల్లితెర రంగంలో ఉన్నారు. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో కూడా ఆయన వద్ద 5 బుల్లితెర సీరియల్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిసింది. ఈ సంఘటనతో యూనియన్‌ల బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment